'విరూపాక్ష' తొలిరోజు కలెక్షన్స్ లో ఆకట్టుకుంది. పాజిటివ్ టాక్ రావడంతోపాటు ఏకంగా అన్ని కోట్ల రూపాయల్ని వసూలు చేసింది. ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
సినిమా ఏదైనా సరే ఎంటర్ టైన్ అయ్యామా లేదా అని మాత్రమే తెలుగు ప్రేక్షకులు చూస్తారు. ఒకవేళ నచ్చితే నలుగురికి చెబుతారు. అలా తాజాగా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మూవీ ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్, సంయుక్తా మేనన్ హీరోహీరోయిన్లు కావడం, ట్రైలర్ కూడా ఇంట్రెస్ట్ గా ఉండేసరికి సమ్ థింగ్ ఏదో ఉండబోతుందని అనుకున్నారు. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అదిరిపోయే ట్విస్టులతో సినిమా థియేటర్లలో అలరిస్తోంది. ఈ క్రమంలోనే తొలిరోజు మంచి వసూళ్లు కూడా వచ్చేశాయి. ప్రస్తుతం ఈ కలెక్షన్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయాయి.
అసలు విషయానికొస్తే.. ‘రిపబ్లిక్’ సినిమా టైంలో సాయిధరమ్ తేజ్ కు బైక్ యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఒప్పుకొని చేసిన మూవీ ‘విరూపాక్ష’. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అంతటా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీలో ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా, ఏదైతే అనుకున్నారో అలానే తీసినట్లు అనిపిస్తోంది. సుకుమార్ మార్క్ స్క్రీన్ ప్లేతో మిస్టరీ థ్రిల్లర్ లోనూ లాజిక్స్ ఎక్కడా మిస్ కాకుండా తీయడం మరో ప్లస్ పాయింట్ గా మారిపోయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు సరిగా సెట్ అయిపోయింది. ఇలా అన్ని సరిగా సెట్ కావడంతో తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 12 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 8.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆల్రెడీ పాజిటివ్ వచ్చింది కాబట్టి వీకెండ్ మరిన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. 2023లో వచ్చిన వీర సింహారెడ్డి వాల్తేరు వీరయ్య, దసరా సినిమాల తర్వాత విరూపాక్ష సినిమా నాల్గవ అత్యుత్తమ ఓపెనర్ గా నిలిచింది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా.. నైజాంలో 238+, సీడెడ్ లో 165+, ఆంధ్ర, తెలంగాణలో 715+, రెస్టాఫ్ ఇండియాలో 75+, ఓవర్సీస్ లో 220+ స్క్రీన్లలో ప్రదర్శితమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 1010+ స్క్రీన్లలో సినిమా ప్రదర్శితమవుతోంది. మరి మీలో ఎంతమంది ‘విరూపాక్ష’ చూశారు. మీకెలా అనిపించింది కింద కామెంట్ చేయండి.