Virata Parvam: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటింగ్ మూవీగా విడుదలైంది ‘విరాట పర్వం’. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను.. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కించాడు. ఈ సినిమాను యాక్షన్ డ్రామాగా సుధాకర్ చెరుకూరి, డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. అయితే.. దాదాపు రెండేళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా.. మొత్తానికి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇక రిలీజ్ దగ్గర పడుతున్నకొద్దీ అంచనాలు భారీ స్థాయిలో క్రియేట్ చేసిన విరాట పర్వం.. విడుదలైన మొదటి నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే.. సాయిపల్లవి నటించడంతో ఈ సినిమాలో అంత విశేషం ఏముందా అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ఇక తొలి రోజు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. వసూళ్ల పరంగా అయితే ఆ స్థాయి ఫలితాన్ని రాబట్టలేదని తెలుస్తోంది. సినిమాలో నటనపరంగా సాయి పల్లవి వెన్నెల పాత్రలో ఆకట్టుకున్నా.. జనాలు భారీ స్థాయిలో థియేటర్లకు రాలేదని టాక్. కానీ.. వెన్నెల పాత్రలో నటించిన సాయి పల్లవికి ఈ మూవీతో అవార్డు గ్యారంటీ అని సినిమా చూసిన నెటిజన్లు బలంగా చెబుతుండటం విశేషంగా మారింది.
ఇదిలా ఉండగా.. విరాట పర్వం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. సినీవర్గాల టాక్ ప్రకారం.. విరాట పర్వం స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ 15 కోట్లకు సొంతం చేసుకుందట. ఒకవేళ ఇదే నిజమైతే.. ఈ సినిమాకు ఓటీటీ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ రూపంలోనూ భారీ మొత్తం అందే అవకాశాలు ఉన్నాయట. ఇక ఉత్తర తెలంగాణలో 1990ల నాటి యదార్థ గాథ ఆధారంగా.. నక్సలిజం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. మరి విరాటపర్వం మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.