ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ మరే హీరోయిన్‌కి లేదని చెప్పవచ్చు. ఆమె ఎంచుకునే సినిమాలు, క్యారెక్టర్లు ఇవేవి.. కావు.. మరేదో ప్రత్యేక ఆకర్షణ.. సాయి పల్లవికి అభిమానులను పెంచుతోంది. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి అభిమానులు భారీగా తరలివస్తారు. ఆమె క్రేజ్ చూసి స్టార్ హీరోలు, దర్శకులు సైతం ఆశ్చర్యపోతుంటారు. ఇక సాయి పల్లవి డ్యాన్స్, నటనకి చాలా మంది అభిమానులున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఇక తాజాగా ఓ ప్రైవేట్ చానెల్ ఇంటర్వ్యూకి హాజరైన సాయి పల్లవి.. పలు ఆసక్తికర అంశాల గురించి వెల్లడించింది. ఆ వీడియోలు కూడా తెగ వైరలయ్యాయి. ఇక సాయి పల్లవి ప్రస్తుతం విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఈవెంట్లలో సాయి పల్లవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కొన్ని రోజుల క్రితం సాయి పల్లవి కర్నూలుకు వస్తుందనే వార్త తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. గాలి వానను సైతం లెక్కచేయకుండా ఆమె కోసం ఎదురు చూశారు. ఇక తాజాగా విరాటపర్వం టీమ్ వరంగల్‌లో మూవీ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించింది. అక్కడ కూడా అదే అభిమానం. సాయి పల్లవి మాట్లాడుతన్నంతసేపు.. అభిమానులు ఈలలు, కేకలతో మైదానాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలో వేదిక మీద ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: Sai Pallavi: చిరంజీవి గారి సినిమాకు నో చెప్పడానికి కారణం అదే: సాయిపల్లవి
దర్శకుడు తరుణ్ భాస్కర్ సాయి పల్లవికి సారె పెట్టాడు. ఇక తెలుగు వారి ఇళ్లలో సారెకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటి ఆడపిల్లకు ఎంతో ప్రేమానురాగాలతో, అభిమానంతో ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇక సారెలో అరిశెలు, శకినాలు, మురుకులు ఇలా రకరకాల పింటి పదార్థాలుంటాయి. తరుణ్ భాస్కర్ పెట్టిన సారెలో కూడా ఇవే పదార్ధాలు ఉన్నాయి. ఆయన తల్లి.. గీతా భాస్కర్.. సాయి పల్లవితో కలిసి ఫిదా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ అనుబంధం కొద్ది ఆమెకు సారె పంపి సత్కరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. తరుణ్ భాస్కర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. సినిమా వేడుకలో ఇలాంటి దృశం అరుదైనదే కాక.. అపురూపం అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలపో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Sai Pallavi: మెగాస్టార్ డ్యాన్స్ పై సాయిపల్లవి కామెంట్స్.. వీడియో వైరల్!