ఎప్పుడైనా విమానం ఎక్కారా? ఆ జర్నీ అనుభవాలు మీకింకా గుర్తున్నాయా? అయితే మీరు బోలెడు బహుమతులు గెలుచుకోవచ్చు.
సముద్రఖని.. ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తొలుత దర్శకుడిగా మారి విభిన్నమైన చిత్రాలు తీసిన ఆయన.. ఆ తర్వాత కాలంలో నటుడిగా మారారు. యాక్టర్‌గా అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సముద్రఖనిని నటుడిగా నిలబెట్టిందని చెప్పొచ్చు. మాస్ మహారాజా రవితేజ మూవీ ‘క్రాక్’లో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు సముద్రఖని. ఈ సినిమాతో ఆయన తెలుగులో ఫుల్ పాపులారిటీ సంపాదించారు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’లోనూ మరో కీలక పాత్రలో ఛాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు సముద్రఖని.
ఇక, సముద్రఖని ప్రధాన పాత్రలో ఒక చిత్రం తెరకెక్కుతోంది. ‘విమానం’ పేరుతో రూపొందుతున్న ఈ మూవీని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో వీరయ్య అనే మధ్య వయస్కుడి పాత్రలో సముద్రఖని కనిపిస్తున్నారు. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ మీద రూపొందిస్తున్న ఈ సినిమా జూన్ 9న రిలీజ్ కానుంది. ‘విమానం’ను శివప్రసాద్ యానాల డైరెక్ట్ చేశారు. ఈ మూవీ టీమ్ ఆడియెన్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎప్పుడైనా విమానం ఎక్కిన వారు ఆ అనుభవాలను తమతో పంచుకోవాలని మూవీ టీమ్ కోరింది. ఫ్లైట్ జర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanamకు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని తెలిపింది. ఇందులో పాల్గొనేవారికి గిఫ్ట్స్ ఇస్తామని మేకర్స్ పేర్కొన్నారు.