సినీ ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించకుంటున్నారు. కొందరు అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రి ఇచ్చి సూపర్ స్టార్స్ గా ఎదిగిన వాళ్లు ఉన్నారు. కమల్ హాసన్, శ్రీదేవి, మహేష్ బాబు, జూనియర్ యన్టీఆర్… ఇలా చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్లుగా ఎదిగారు. ఇక హన్సిక, రాశి, కీర్తి సురేష్ లతో సహా మరికొందరు కూడా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ప్రస్తుతం హీరోయిన్ కొనసాగుతున్నారు. అయితే ఇలా కొందరు తెరపై కనిపిస్తుంటే.. మరికొందరు కనుమరగై పోతుంటారు. ఇలా సినీ పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో నేహా తోట ఒకరు. ఇంతకి ఈ నేహ తోట ఎవరు అనేక కదా మీ సందేహం.. విక్రమార్కుడు సినిమా రవితేజ కూతురుగా నటించిన పాప మే ఈ నేహ తోట. అయితే ప్రస్తుతం ఆమె లేస్ట్ పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దర్శకధీరుడు రాజమౌళి , మాస్ మహరాజ రవితేజ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ మూవీ విక్రమార్కుడు. ఈ చిత్రంలో రవితేజ డబల్ రోల్ లో యాక్టింగ్ చేస్తారు. ఇందులో కన్నడ బ్యూటీ అనుష్క గా హీరోయిన్ గా నటించింది. అయితే ఈసినిమాలో రవితేజ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటూనే, తన కూతురికి పట్ల ఓ మంచి తండ్రి పాత్రలో నడిస్తారు. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురుగా నటించింది నేహ తోట. విక్రమార్కుడు సినిమాతో ఈమె మంచి గుర్తింపు సంపాదించింది. ఆతర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రక్ష’ మూవీలో తన యాక్టింగ్ తో అందరిని భయపెట్టింది. అనంతరం నేహాకు అనేక సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం ఆమె చదువును దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరంగా ఉంచారు.
ప్రస్తుతం నేహా తోటకు సంబంధించిన తాజా పిక్స్ నెట్టింటో వైరల్ అవుతున్నాయి. నేహా బాల్యం ఫోటో, ప్రస్తుతం ఫోటోను చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. విక్రమార్కుడు మూవీలో నాన్న.. అంటూ ముద్దు ముద్దు మాటలు పలికిన పాప ఈమెనా! అని నెటిజన్లు ఆశ్చరపోతున్నారు. మరి.. ఈ చిన్నారి తాజాగా ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Anchor Anasuya: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై! పోస…