Vikram: ఓటిటి ప్లాట్ ఫాములు వచ్చాక థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకు ఆదరణ తగ్గుముఖం పడుతోందనే చెప్పాలి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య వారవారం పెరుగుతూనే ఉంది. కానీ.. థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుంది. ఎంతటి స్టార్ హీరోల సినిమాలైనా జనాలు.. మొదటి మూడు, నాలుగు రోజులు తప్ప ఆ తర్వాత కనిపించడం లేదు. అదీగాక రిలీజైన సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తేగాని థియేటర్లకు వెళ్లేందుకు జనాలు ఆసక్తి కనబరచడం లేదు.
ఈ మధ్యకాలంలో సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయినా.. ఓటిటిలో చూసేందుకే మక్కువ చూపిస్తున్నారు ఫ్యామిలీ ప్రేక్షకులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్న సినిమా నుండి పాన్ ఇండియా సినిమా వరకూ అన్ని థియేట్రికల్ రిలీజైన కొద్దిరోజులకే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్లే అవసరం ఏముందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు థియేటర్లలో రన్ అవుతున్నా.. లీకుల కారణంగా త్వరగా ఓటిటి రిలీజ్ అవుతుంటాయి.
ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో రికార్డు స్థాయి వసూళ్లు రాబడుతోంది. ఇటీవలే రూ. 300 కోట్ల క్లబ్ లో చేరి ఈ ఏడాది హైయెస్ట్ కోలీవుడ్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలై రెండు వారాలు కాకముందే ఓటిటిలో లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినీవర్గాల తాజా సమాచారం ప్రకారం.. విక్రమ్ మూవీకి సంబంధించి హెచ్‌డీ(HD) స్టిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతున్న విక్రమ్ మూవీ స్టిల్స్ నెట్టింట దర్శనమిచ్చేసరికి కోలీవుడ్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మరి సినిమా లీక్ అయ్యిందా లేదా హెచ్‌డీ స్టిల్స్ మాత్రమే లీక్ అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. విక్రమ్ సినిమాకు సంబంధించి హెచ్‌డీ స్టిల్స్ ని.. ఓ పాపులర్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన విక్రమ్ హెచ్‌డీ స్టిల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.