Vikram: విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘విక్రమ్‘. యువదర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో.. కలెక్షన్స్ పరంగా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతోంది.
ఇప్పటికే ఈ ఏడాది కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విక్రమ్.. తాజాగా రూ. 400 కోట్ల క్లబ్ లో చేరింది. జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విక్రమ్.. 25 రోజుల్లోనే 400 కోట్లు వసూల్ చేసి ‘ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్స్’లో 2వ స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో సూపర్ స్టార్ రజిని నటించిన ‘రోబో 2.o’ నిలిచింది. అయితే.. విక్రమ్ బ్లాక్ బస్టర్ సందర్భంగా మేకర్స్ తో పాటు చిత్రయూనిట్ అందరికీ గ్రాండ్ గా పార్టీ, భారీ గిఫ్టులు ఇచ్చేశారు కమల్.
ఈ క్రమంలో ప్రస్తుతం విక్రమ్ సినిమా ఓటిటి రిలీజ్ అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిస్నీ హాట్ స్టార్ లో జూలై 8 నుండి విక్రమ్ స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. కానీ.. ఇప్పటివరకూ దీనిపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక లోకేష్ కనకరాజ్ తదుపరి సినిమాను దళపతి విజయ్ తో చేయనున్నాడు. యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఆ సినిమాతో విజయ్ ని కూడా ‘విక్రమ్ యూనివర్స్’లోకి తీసుకురాబోతున్నాడని టాక్. మరి విక్రమ్ మూవీ కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Vikram – just the total overseas gross is ₹ 120 CR 👌🔥
“Annaatha aaduraar oththikko oththikko” moment literally! https://t.co/87olM003H1
— Kaushik LM (@LMKMovieManiac) June 26, 2022