కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ తన నటనతో కన్నడలో ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా పునీత్ రాజ్ కుమార్ కి హార్ట్ ఎటాక్ కి గురయ్యారు. జీమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో.. కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ని బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు.పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్దకి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్కూల్స్, ధియేట్ర్స్ అన్నీ మూసేయాల్సిందిగా కోరింది. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యలను పరామర్శించారు.
పునీత్ రాజ్ కుమార్ వయసు ప్రస్తుతం 46 సంవత్సరాలు మాత్రమే. ఆయన చాలా ఫిట్ గా ఉంటారు. డైట్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అలాంటి వ్యక్తికి స్ట్రోక్ రావడం ఏమిటి? ఒక్కసారిగా కన్ను మూయడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు అభిమానులను ఇంకా వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విక్రమ్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ రంగనాథ్ నాయక్ పునీత్ మరణంపై సంచలన నిజాలను బయటపెట్టారు.
వర్కౌట్స్ చేస్తున్న సమయంలో పునీత్ కి కార్డియాలజిస్ట్ అటాక్ వచ్చింది. వెంటనే పునీత్ ని కుటుంబ సభ్యులు విక్రమ్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు. మేము వైద్యం మొదలుపెట్టే సమయానికే పునీత్ లో చలనం లేదు. స్పెషలిస్ట్ లతో నిండిన మా టీమ్ అంతా పునీత్ రాజ్ కుమార్ ని అత్యవసర చికిత్స అందించాము. షాక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. అయినా.. ఆయన శరీరం వైద్యానికి స్పందించలేదు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పునీత్ మరణించారు అని విక్రమ్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ రంగనాథ్ నాయక్ తెలియజేశారు. మరి.. పునీత్ హఠాన్మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.