Vikram: ‘విక్రమ్’ సినిమా హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. సరైన హిట్లు లేక ఇబ్బందుల్లో ఉన్న లోకనాయుకుడు ‘కమల్ హాసన్’కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. కమల్‌ను ఆర్థికంగా కూడా పుంజుకునేలా చేశాడు. ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి సారి మల్లీవర్స్‌ను తెరపైకి తెచ్చాడు. సౌత్ సినిమా అభిమానులు ప్రస్తుతం ఈ సినిమా గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సినిమా సూపర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. బుధవారం ట్విటర్‌లో #AskDirLokesh పేరిట క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ కార్యక్రమం నిర్వహించాడు.
ఈ సందర్భంగా ఓ అభిమాని ‘‘ ఖైదీలో చనిపోయిన అర్జున్ దాస్ క్యారెక్టర్ విక్రమ్ సినిమాలో ఎలా బతికుంది.. నేను నమ్మలేకుండా ఉన్నాను’’ అని లోకేష్‌ను ప్రశ్నించాడు. దీనికి లోకేష్ సమాధానం ఇస్తూ.. ‘‘ ఖైదీ సినిమాలో నెపోలియన్ కొట్టడం వల్ల అన్బు దవడ మాత్రమే విరిగిపోయింది. అతడు చావలేదు. విక్రమ్ సినిమాలో అన్బు గొంతుపై మీరు కుట్లను చూడొచ్చు. దీని గురించి ఖైదీ 2 లో వివరణ ఇస్తా’’ అని తెలిపాడు. కాగా, విక్రమ్ సినిమా భారీ విజయాన్ని అందుకుని లాభాల బాట పట్టిన నేపథ్యంలో కమల్ ఎంతో సంతోషంగా ఉన్నారు.
తన సంతోషాన్ని బహుమతుల రూపంలో పంచేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి లగ్జరీ కారు(లెక్సస్ – కోటిన్నర విలువ ఉంటుందని అంచనా)ను.. ఈ సినిమాలో స్పెషల్ రోల్ ‘రోలెక్స్’గా నటించిన హీరో సూర్యకు దాదాపు రూ. 28 లక్షలు విలువ చేసే రోలెక్స్ వాచ్‌ను.. కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లకు లక్షన్నర విలువ చేసే బైకులను కొనిచ్చాడు. మరి, లోకేష్ మల్టీవర్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ask me questions with #AskDirLokesh pic.twitter.com/IjCx4oTmkG
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 8, 2022
ఇవి కూడా చదవండి : తెలుగు బిగ్ బాస్ -5 విన్నర్ Vj. సన్నీపై దాడి!