విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన ‘విక్రమ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. కమల్ నుండి దాదాపు నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఈ ఫుల్ లెన్త్ యాక్షన్ డ్రామాలో స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ మరియు సూర్య కీలకపాత్రల్లో నటించారు. అయితే.. విక్రమ్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో సినిమాలోని అన్ని పాత్రలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.
ఇక ముఖ్యంగా ఈ సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రకు ప్రేక్షకులు విశేషంగా కనెక్ట్ అవుతున్నారు. విక్రమ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన చిన్నపిల్లాడు ఎవరా? ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే.. విక్రమ్ లో సినిమా అంతటా కనిపించే చిన్నపిల్లాడి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశాక ఇప్పుడు మనం సినిమాలో చూస్తున్న బాబు సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ బాబు పేరేంటంటే.. దర్శన్. తల్లి పేరు అభినయ.ఈ నేపథ్యంలో బేబీ దర్శన్ తల్లి అభినయ మాట్లాడుతూ.. “విక్రమ్ సినిమాలో మా బాబును చూసి చాలా ఆనందంగా ఉంది. అదికూడా కమల్ సర్ పక్కన ఫుల్ లెన్త్ రోల్ చేయడం అంటే గర్వంగా ఉంది. అసలు దర్శన్ కి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? అనే ప్రశ్నకు స్పందించిన బాబు తల్లి.. “మా ఆయన ఇండస్ట్రీలోనే కాస్టింగ్ ఫీల్డ్ లో వర్క్ చేస్తారు. మా మరిది సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంటాడు. మా మరిదికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో మంచి పరిచయం ఉంది. ఆ విధంగా చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరిగే టైంలో మా బాబు గురించి లోకేష్ కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాబును ఆడిషన్స్ కి తీసుకెళ్ళాం. సెలెక్ట్ అయిపోయాడు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి బేబీ దర్శన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
😍😍😍😘😘😘Darshan baby https://t.co/KIu7Rr38uo
— Deepika (@deepika_9595) June 7, 2022