తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో.."TFCC నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023" వేడుకలను దుబాయ్ లో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ నంది అవార్ట్స్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలకు కచ్చితంగా నంది అవార్డులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
గత కొంతకాలంగా టాలీవుడ్ లో నంది అవార్డుల ప్రధానోత్సవం ఆగిపోయిన సంగతి తెలిసిందే. దాంతో చాలా మంది నటీ, నటులు అసంతృప్తికి లోనైయ్యారు. ఇక వీరి అసంతృప్తికి తెరదించుతూ.. తెలంగాణ రాష్ట్రం నంది అవార్డులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో..”TFCC నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023″ వేడుకలను దుబాయ్ లో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ నంది అవార్ట్స్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలకు కచ్చితంగా నంది అవార్డులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
నంది అవార్డ్స్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇక ఇప్పటికే ఈ అవార్డ్స్ పై పోసాని కృష్ణ మురళి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోసాని వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా రియాక్ట్ అయిన సంగతి కూడా మనకు తెలుసు. ఇక తాజాగా నంది అవార్డ్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో.. తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో టీఎఫ్ సీసీ అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 పేరుతో ఈ అవార్డు వేడుకలను దుబాయ్ లో జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన బ్రోచర్ ను విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా నంది అవార్డు లు ఇవ్వాలి. తద్వారా రాష్ట్రం పర్యటకంగా మరింది అభివృద్ధి చెందుతుంది. సినిమాలు షూటింగ్ లకు అనువైన పర్యటక స్థలాలకు పెట్టింది పేరు తెలంగాణ. దాంతో 90 శాతం సినిమా ఇక్కడ చేస్తే.. రాయితీలతో పాటుగా సినిమాకు అవార్డులు కూడా ఇవ్వాలి. అప్పుడే పర్యటకంగా మరింతగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే సినిమాలకు కచ్చితంగా నంది అవార్డులు ఇవ్వాలని” విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఇక టీఎఫ్ సీసీ నంది అవార్డ్స్ 2021-22 సంవత్సరాలకు గాను ఇవ్వనున్నట్లు టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2021-22 సంవత్సరాల్లో విడుదలై చిత్రాల వాళ్లు ఈ అవార్డులకు అప్లై చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఇక తర్వరలోనే దుబాయ్ ప్రిన్స్ డేట్ తీసుకుని.. ఇందుకు సంబంధించిన అధికారిక తేదీని ప్రకటిస్తామని రామకృష్ణ గౌడ్ స్పష్టం చేశారు. మరి ఇన్ని సంవత్సరాలకు మళ్లీ నంది అవార్డ్స్ ఇవ్వడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.