RRR, బాహుబలి, భజరంగీ బాయిజాన్.. ఈ సినిమాలన్ని ఎంత ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్‌లో భారీ విజయాలు సాధించాయి. ఇక తాజాగా విడుదలైన పాన్ ఇండియా సినిమా RRR కలెక్షన్ల వసూళ్లల్లో రికార్డులు తిరగరాస్తుంది. బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇక విజయవంతమైన చిత్రాల దర్శకుడిగా రాజమౌళికి వచ్చిన గుర్తింపులో అధిక భాగం ఆయన తండ్రి విజేయంద్ర ప్రసాద్‌కు దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇది కూడా చదవండి: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమా విజయంలో ప్రధాన పాత్ర పోషించే వాటిలో కథ ముఖ్యం. బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించే కథలు అందించడంలో విజయేంద్ర ప్రసాద్ సిద్ధ హస్తులు. ప్రస్తుతం ఆయన కూడా పాన్ ఇండియా రేంజ్ కథలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచారు. తాజాగా ఆయన కథ అందించిన RRR భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే చాలామంది అభిమానులు పవన్-రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రావాలని బలంగా కోరుకుంటున్నారు. తాజాగా దీనిపై విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు సినిమా, పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ అంటే కాంట్రవర్సీ! అతని గురించి మాట్లాడను: పూనమ్!
పవన్ కల్యాణ్-రాజమౌళి కాంబినేషన్ ఎందుకు సెట్ కావడం లేదు.. వారిద్దరూ కలిసి ఎప్పుడు సినిమా తీస్తారు అనే ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర సమాధానం చెప్పారు. పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ మెగా పవర్ స్టార్ అని.. ఆయన రేంజ్ స్టార్ ఎవరూ లేరని తెలిపారు. ఇక మహేష్ బాబుతో సినిమా గురించి పదేళ్ల క్రితం అనుకుంటే.. అది ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం వచ్చిందని తెలిపారు. అన్ని కుదిరితే మహేష్‌తో సినిమా తర్వాత పవన్ కల్యాణ్-రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అది కూడా పవన్ కల్యాణ్ సీఎం కాకపోతే అన్నారు. ప్రస్తుతం ఆయన సమాధానం నెట్టింట వైరల్‌గా మారింది. విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.