తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ డైరెక్టర్ ఎవరంటే టక్కున వినిపించే పేరు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పి ఓ మెట్టు ఎక్కించాడు. ఇక ఆ సినిమాతో ఆయన రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకలుగా జక్కన్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా భారీ అంచనాలే నెలకొన్నాయి. విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక విషయం ఏంటంటే..? ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడనే ప్రశ్న అందరి మెదళ్లలో మెదులుతు ఉంది. అయితే ఇదే అంశంపై తండ్రి విజయేంద్రప్రసాద్ కాస్త క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఆర్ఆర్ఆర్ సినిమా ఎందుకు చూడాలంటే..?
తను మహేష్ బాబు కోసం ఓ కథ రెడీ చేశానని దానిని రాజమౌళికి వినిపించడమే మిగిలి ఉందని తెలిపాడు. కొన్ని సందర్భాల్లో జక్కన్న తన తర్వాత సినిమా మహేష బాబుతోనే అంటూ కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి తండ్రి విజయేంద్రప్రసాద్ రాసిన కథను విని తన తదుపరి సినిమా మహేష్ బాబుతోనే చేస్తుండొచ్చనే వార్తలు కూడా లేకపోలేదు. ఇక ఏదేమైన రాజమౌళి తర్వాత ఎవరితో తీయనున్నాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.