దేశం అంతా ప్రస్తుతం ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది ట్రిపుల్ ఆర్ అని చెప్పుకోవచ్చు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే.., తాజాగా వీరి క్యారెక్టర్స్ బ్యాక్ డ్రాప్ పై మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ సంచలన విషయాలను బయట పెట్టారు.
ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ వీడియోస్ విడుదలైన సమయం నుండి అందరికీ రెండు డౌట్స్ అలానే ఉండిపోయాయి. భీమ్ పాత్ర పోషించిన తారక్ ముస్లిం గెటప్ లో ఎందుకు కనిపిస్తున్నాడు? రామ రాజు పాత్రలో కనిపిస్తున్న రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ డ్ర్స్ లో ఎందుకు ఉన్నాడు? ఈ రెండు ప్రశ్నలు అభిమానుల మెదడుకి పని పెట్టాయి. ఇక తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోలో కూడా రామరాజు, భీమ్ ఇలానే కనిపించడంతో విజయేంద్ర ప్రసాద్ కొన్ని విషయాలను లీక్ చేశారు.
విజయేంద్రప్రసాద్ తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భీమ్ ముస్లిం యువకుడిగా మారాడానికి కారణం ఉందన్నారు. భీమ్ ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారని తెలిపారు. నైజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికే భీమ్ ముస్లిం యువకుడిగా మారాడని పేర్కొన్నారు. అలాగే అల్లూరి పాత్రలో నటించిన చరణ్ను పొలీస్ గా చూపించడానికి ఓ కారణం ఉందని, వెండితెరపై ప్రేక్షకులకు అది సర్ప్రైజ్ ఇస్తుందని విజయేంద్రప్రసాద్ అన్నారు. దీంతో.., కేవలం వారి క్యారెక్టర్ గెటప్స్ విషయంలోనే ఇంత స్టోరీ ఉంటే.., ఇక కథ అదిరిపోవడం గ్యారంటీ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.