తెలుగు ఇండస్ట్రీలో ‘ఫిదా’ చిత్రంతో మంచి పేరు సంపాదించింది సాయిపల్లవి. ఈమె నటించిన ‘విరాట పర్వం’ రిలీజ్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రమోషన్ సందర్భంగా.. కశ్మీర్ పండిట్ల హత్యను, గోవులను అక్రమ రవాణా చేసే వారి హత్యలు ఒకేటనని చెప్పిన మాటలు ఇప్పుడు వివాదానికి దారి తీస్తున్నాయి. అందరూ మానవత్వంతో మెలగాలని, ఎవరైనా బాధితుల పక్షాన ఉండాలంటూ సాయి పల్లవి చేసిన కామెంట్లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారాన్ని రేపింది. ఈ కారణంతోనే హీరోయిన్ సాయి పల్లవిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సైతం చేశారు. తాజాగా సాయి పల్లవి చేసిన కామెంట్స్ పై నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి వరుసగా ట్విట్స్ చేసింది.
ఇండస్ట్రీలో ఒక సెలబ్రెటీ మాట్లాడితే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుందని.. మత విశ్వాసాలకు సంబంధించిన విషయాన్ని సాయి పల్లవి ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఆమె అన్నారు. అంతేకాదు తమ ప్రమోషన్ గురించి చెప్పాల్సింది విద్వేశాలు రెచ్చగొట్టేలా సున్నితమైన అంశాల గురించి అలా మాట్లాడటం మంచిది కాదని విజయశాంతి అన్నారు. దేశంలో అన్ని చోట్లు ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో తెలుస్తుంది అన్నారు.
మొత్తానికి నటి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేగడం.. ఆమె పై కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు కాకుండా.. ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడితే చాలా ప్రభావం చూపుతుందని సాయి పల్లవికి చెప్పకనే చెప్పారు విజయశాంతి. మరి ఈ విషయం పై సాయి పల్లవి ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో… సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 16, 2022
ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది. pic.twitter.com/rw3SED4p9d
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 16, 2022