భార్య,భర్తల మధ్య సాన్నిహత్యాన్ని కన్నబిడ్డల మీద వాత్సల్యాన్ని చూపించేది కూడా సెలబ్రిటీలు వారి సోషల్ మీడియా ఖాతాలలో పెట్టేసి సో స్వీట్ అని ట్యాగ్స్ పెట్టేస్తున్నారు. అది నచ్చిన వాళ్ళు ఆహా అంటుంటే నచ్చని వాళ్ళు తెగ తిట్టి పోస్తున్నారు. ఇప్పుడు ఓ నటి చేసిన పోస్టుకు కూడా అదే పరిస్థితి వచ్చిపడింది. తమిళ దర్శకుడు అగత్యన్ రెండో కుమార్తె, నటి విజయలక్ష్మి సోషల్ మీడియాలో తన కొడుకుతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి ‘మమ్మీ – ఐ లవ్ యూ… అతి పెద్ద గ్రహమైన బృహస్పతి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇందులో ఆమె తన కొడుక్కి ప్రేమగా ముద్దు పెట్టింది. అయితే ఆమె తన కొడుకు పెదాల మీద ముద్దివ్వడం నెటిజన్లకు పెద్దగా నచ్చినట్లు లేదు.
ఈ ఫోటోపై కొందరు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇందులో ఆమె తన కొడుక్కి పెదాల మీద ముద్దివ్వడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. ఆమెని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసిన కొందరు నెటిజన్లు చివాట్లు పెడుతూ తెగ తిట్టిపోస్తున్నారు. ఈ నెగటివ్ కామెంట్స్ పై కూడా స్పందించిన విజయలక్ష్మి అంతే ఘాటుగా బదులిచ్చింది. దీని వెనకాల కూడా ఏమైనా సిద్ధాంతాలుంటాయా? ఈ ఫొటో చూడగానే చెడిపోతారా? ఆపండెహె అంటూ కౌంటర్ ట్వీట్ చేసింది.
Mummay… I love you ..
bigger than Jupiter!! pic.twitter.com/KoB74QB5Mn— Vijayalakshmi A (@vgyalakshmi) July 7, 2021