ఈమధ్య కాలంలో ప్రముఖుల ఇళ్లల్లో వరుస దొంగతనాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం వెలుగు చూడగా.. తాజాగా మరో స్టార్ సింగర్, నటుడి ఇంట్లో దొంగతనం వెలుగు చూసింది. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో పని చేసేవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఇక ఐశ్వర్య రజనీకాంత్ తనతో గొడ్డు చాకిరీ చేయించుకుని.. జీతం సరిగా ఇవ్వలేదని.. అందుకే దొంగతనం చేశానని నిందితురాలు చెప్పుకొచ్చింది. ఈ కేసు విచారణ పూర్తి కాకముందే మరో చోరీ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, గాయకుడు, నటడు విజయ్ యేసుదాస్ ఇంట్లో కూడా భారీ దొంగతనం జరిగింది. శుక్రవారం రోజున చోరీ చోటు చేసుకుంది. దీని గురించి విజయ్ యేసుదాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
చెన్నైలోని అభిరామపురంలోని విజయ్ యేసుదాసు నివాసంలో శుక్రవారం అనగా మార్చి 31, 2023న దొంగతనం చోటు చేసుకుంది. భారీగా బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, పలు డాక్యుమెంట్స్ దొంగతనానికి గురయ్యాయి. దీని గురించి పోలీసులు ఫిర్యాదు చేసిన విజయ్ యేసుదాస్.. తన ఇంట్లో పని చేసేవారిపై అనుమానం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తమిళ సెలబ్రిటీల ఇళ్లల్లో ఇలా వరుస దొంగతనాలు చోటు చేసుకోవడం.. అది కూడా పని వారే చేతి వాటం చూపడం కలవరపెడుతోంది.
ప్రముఖ సింగర్ యేసుదాస్ కుమారిడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ నుండి సంగీతంలో బీఏ చేశాడు. సౌత్‌లో అన్ని ఇండస్ట్రీల్లో పాటలు పాడాడు. విజయ్‌ది ప్రమే వివాహం. ఈయన భార్య పేరు దర్శన. వీరికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. ఇక ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో సుమారు 60 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వ్రజాలు, వెండి వస్తువులు దొంగిలించారు. మరి సెలబ్రిటీల ఇండ్లలో ఇలా దొంగతనాలు చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Guess the reliance on #Househelp has other unforeseen risks..very relevant in #todays #Times Gold, diamond jewellery #Missing from singer Vijay Yesudas’s home in #Chennai | Chennai News – Times of India https://t.co/j36oYspZaJ
— Arihant Dudhodia (@ArihantDudhodia) March 31, 2023