పరిశ్రమలో చాలామంది హీరోలు ఉంటారు.. కానీ నటులు చాలా అరుదుగా ఉంటారు. పాత్ర ఏదైనా సరే.. దానిలో పరకాయ ప్రవేశం చేసి.. ఆయా పాత్రలకు జీవం పోస్తారు. ఈ కేటగిరిలో ముందు వరుసలో ఉంటాడు విజయ్ సేతుపతి. పాత్ర నచ్చితే చాలు.. దాని కోసం ఏం చేయడానికి అయినా సిద్ధపడతాడు. అలా వచ్చినవే సూపర్ డీలక్స్, ఉప్పెన, విక్రమ్, 96 సినిమాలు. ఇలా ఆయా మూవీస్‌లో.. ఆయన తన అద్భుతమైన నటనతో మాత్రమే కాక.. లుక్‌తో కూడా ప్రేక్షకులను అలరించాడు. పాత్ర డిమాండ్ చేస్తే.. దాని కోసం ఎలాంటి లుక్‌లోకైనా మారతాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం సౌత్‌లో హీరో, విలన్‌గా రకరకాల పాత్రలు పోషిస్తూ.. వరుస సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్నారు. సౌత్‌లో సత్తా చాటిన ఈ నటుడు బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
విలక్షణ నటుడిగా ఎంతటి క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో.. ఈ మధ్య కాలంలో అంతకన్నా ఎక్కువగా ట్రోలింగ్ బారిన పడ్డాడు. కారణం.. విజయ్ సేతుపతి బాడీ. సినిమాల్లో విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ… వాటికి తగ్గట్టుగా తన బాడీని మార్చుకున్నాడు విజయ్ సేతుపతి. ఈ క్రమంలో విపరీతంగా లావు అయ్యాడు. దాంతో.. నెటిజనులు ఆయన లుక్‌పై విమర్శలు చేయసాగారు. సినిమాలు సరే.. కాస్త నీ బాడీ, లుక్‌పై దృష్టి పెట్టు అంటూ కామెంట్స్ చేయసాగారు.
ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ సేతుపతి నయా లుక్ చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. స్లిమ్, అండ్ హ్యాండ్‌సమ్ లుక్‌లో కనిపించి.. ట్రోలర్స్‌కి, ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఈ న్యూలుక్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎంతలో ఎంత మార్పు.. లుక్ సూపర్బ్‌గా ఉంది బ్రో.. ఇదే కంటిన్యూ చేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి విజయ్‌సేతుపతి న్యూలుక్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.