దిల్లీ, రోలెక్స్, విక్రమ్.. ఈ పేర్లు చెప్పగానే ప్రతి ఒక్కరూ అలెర్ట్ అయిపోతారు. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. తీసింది కొన్ని సినిమాలే అయినా.. తన మార్క్ సినిమాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి పడేశారు. యాక్షన్ మూవీస్ చూసేవాళ్లని మాయ చేసేశాడు. ఈ మధ్య కాలంలో అందరూ సినిమాటిక్ యూనివర్స్ అనే దాని గురించి మాట్లాడుకోవడానికి రీజన్ కూడా ఇతడే. గతంలో పలువురు డైరెక్టర్స్ ఈ తరహా యూనివర్స్ ని ప్రయత్నించినప్పటికీ.. లోకేష్ ని మ్యాచ్ చేయలేకపోయారు.
ఇక విషయానికొస్తే.. గతేడేదా దక్షిణాదిలో రిలీజైన సినిమాల్లో ‘విక్రమ్’ సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. విలక్షణ నటుడు కమల్ హాసన్ కు చాలారోజుల తర్వాత అద్భుతమైన బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఈ క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కే దక్కుతుంది. ఎందుకంటే యాక్షన్ ని నెక్స్ట్ లెవల్లో చూపించిన లోకేష్.. తాను గతంలో తీసిన ‘ఖైదీ’ ని ‘విక్రమ్’ సినిమాతో లింక్ చేశాడు. ఇక ‘విక్రమ్’ క్లైమాక్స్ లో రోలెక్స్ గా సూర్య చూసి ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు. ఇక తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విజయ్ తో సినిమా రాబోతుందని చాలారోజుల క్రితమే అనౌన్స్ చేశారు.
తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం జరగ్గా, షూటింగ్ కోసం కశ్మీర్ కూడా వెళ్లిపోయారు. ఇదే ఊపులో టైటిల్ ని కూడా తాజాగా రిలీజ్ చేశారు. ‘లియో’ అని టైటిల్ కు బ్లడీ స్వీట్ అనే క్యాప్షన్ పెట్టారు. సినిమా ఎలా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చినట్లు ఓ వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఇందులో చాక్లెట్ మేకర్ గా కనిపించిన విజయ్.. చాక్లెట్ తోపాటు ఓ కత్తి కూడా తయారు చేయడం చూపించారు. చివరగా చాలామంది మనుషులు విజయ్ తో ఫైట్ కోసం వచ్చిన షాట్ తో వీడియోని ఎండ్ చేశారు. అయితే ఈ వీడియోలో చూపించిన సెటప్ అంతా కూడా ‘విక్రమ్’ టైటిల్ రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోలో ఉన్నదే. ఈ టైటిల్ టీజర్ చాలా స్టైలిష్ గా ఉండటంతో ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. మరి దళపతి-లోకేష్ కాంబోలో రాబోయే ‘లియో’ మూవీ టీజర్ ఎలా అనిపించింది? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.