సినీ పరిశ్రమలో కాంబినేషన్లకు ఉండే క్రేజ్ వేరు. అలాంటి ఓ క్రేజీ కాంబో సెట్ అయ్యేలా కనిపిస్తోంది. ‘వీరసింహారెడ్డి’ దర్శకుడు గోపీచంద్ మలినేని భారీ ప్రాజెక్టును తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్లో ఫుల్ ఫామ్‌లో ఉన్న దర్శకుల్లో గోపీచంద్ మలినేని ఒకరు. వెంటవెంటనే రెండు హిట్లు ఇచ్చి ఈయన స్టార్ డైరెక్టర్‌గా మారిపోయారు. మాస్ మహారాజా రవితేజతో ‘క్రాక్’, నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ రూపంలో రెండు బ్లాక్ బస్టర్లను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో గోపీచంద్ మలినేనితో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన తర్వాతి చిత్రానికి సంబంధించిన కన్ఫర్మేషన్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగు టాప్ హీరోలు అందరూ ఒప్పుకున్న ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారికి కథ చెప్పి ఒప్పించినా, ఫిల్మ్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక తమిళ స్టార్ హీరోను గోపీచంద్ కలిశారట.
కోలీవుడ్ బిగ్ స్టార్, ఇళయదళపతి విజయ్ను కలసి కథ చెప్పారట గోపీచంద్ మలినేని. సింగిల్ సిట్టింగ్‌లోనే స్టోరీకి ఓకే చెప్పారట దళపతి. ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీని పాపులర్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందట. పూర్తి కథ ఓకే అయితే త్వరలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ చిత్రంలో నటిస్తున్నారు విజయ్. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్-గోపీచంద్ కాంబో మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అటు విజయ్ నుంచి గానీ, ఇటు గోపీచంద్ మలినేని నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి.. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా కోసం మీరు ఆతృతగా ఎదురు చూస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ThalapathyVijay to join hands with #GopichandMalineni next?
Read here https://t.co/d9V1swy2st pic.twitter.com/CIDb99ltpc
— Only Kollywood (@OnlyKollywood) April 18, 2023