రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ విషయంలో అస్సలు భయపడాల్సిన అవసరం లేదని అన్నాడు. దీంతో ఫ్యాన్స్ ఆలోచనలో పడిపోయారు. ఇకపోతే మీ ఫ్రెండ్ కి ఏదైనా పనికొచ్చే విషయం చెప్పండి. అస్సలు పట్టించుకోడు. వీడు నాకు చెప్పడం ఏంటని.. మిమ్మల్ని పైనుంచి కింద వరకు చూస్తాడు. అదే విషయాన్ని అతడి అభిమాన హీరో చెబితే మాత్రం వెంటనే ఫాలో అయిపోతాడు. స్టార్స్ మాటలకు ఉన్న పవర్ అలాంటిది. అలా అని వారు చెప్పిన ప్రతి దాన్ని ఫాలో అయిపోవాలంటే కొద్దిగా కష్టమే. కానీ విజయ్ దేవరకొండ చెప్పినవి మాత్రం ఫ్యాన్స్ నే కాదు.. నార్మల్ నెటిజన్స్ ని కూడా ఆలోచనలో పడేస్తున్నాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కష్టపడి పైకొచ్చిన వాడికి జీవితం విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు ఫేస్ చేసి లైఫ్ లో సక్సెస్ అవుతారు. విజయం సాధించేశాం కదా అని రిలాక్స్ అయిపోయారు. ఎక్కడి నుంచి అస్సలు మర్చిపోరు. అందుకే సమయం దొరికినప్పుడు.. తమ జీవితంలో చూసిన కొన్ని అనుభవాల్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. అవి పాటిస్తే బాగుపడతారనే ఉద్దేశంతో హితభోద చేస్తుంటారు. ఇప్పుడు కూడా విజయ్ గతంలో చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు.. ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో ఓసారి చూసేద్దాం.
‘కాలం గడిచేకొద్దీ నీ ప్రపంచంలోని వ్యక్తులు, వాళ్ల అనుబంధాలు మారిపోతుండొచ్చు. నీతో నీకున్న రిలేషన్ మాత్రం ఎప్పటికీ మారదు. అందుకే నీకు నువ్వే ముఖ్యం’.. ‘అందరి కోసం, అందరి సంతోషం కోసం మనం నటించొచ్చు. మనల్ని మనమే మోసం చేసుకునేలా నటించొద్దు’… ‘నువ్వు తప్పు చేయనప్పుడు, నీలో లోపం లేనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు’… ‘జీవితం కొనసాగిస్తూనే ఉండాలి. గతంతో అనుబంధం పెంచుకోవద్దు, ఆగిపోవద్దు’… ‘మనసులో కల్మషం లేకపోతే, కష్టపడటాన్ని భారంగా భావించకపోతే మన ముఖం అందంతో వెలిగిపోతుంది’…. ‘జీవితమే అన్నీ నేర్పిస్తుంటుంది. అనుభవాన్ని మించిన పెద్ద గురువు ఎవరూ ఉండరు.’ అని విజయ్ చెప్పుకొచ్చాడు. మరి వీటిలో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు అనేది కామెంట్స్ లో పోస్ట్ చేయండి.