పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లైగర్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న రిలీజైంది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకి పూరీ జగన్నాథ్, ఛార్మీ, కరణ్ జోహార్‌లు నిర్మాతలుగా వ్యవహరించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రియల్ బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో లైగర్ టీమ్ చురుగ్గా పాల్గొంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ‘డ్యాన్స్ ఐకాన్’ షోకి గెస్ట్‌లుగా వెళ్లారు.
ఈ షోలో ఆనంద్ అనే డ్యాన్సర్ పార్టిసిపేట్ చేస్తున్నాడు. అయితే ఇతనికి కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి డబ్బులు లేవని, ప్రోపర్‌గా బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని ఓంకార్ అన్నారు. ఆ మాటలు విన్న విజయ్ దేవరకొండ ఎమోషనల్ అయిపోయారు. “బట్టలు లేవని ఫీల్ కాకు. ఎవడే సుబ్రమణ్యం ప్రమోషన్‌కి నా దగ్గర సరైన బట్టలు లేవు. ప్రొడ్యూసర్‌ని అడిగి కాస్ట్యూమ్స్ తీసుకున్నాను. ఆ సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్‌నే నేను వేసుకుని సినిమా ప్రమోషన్‌కి వెళ్ళేవాడిని. నీకు రౌడీ వేర్ నుంచి నీకు ఏది కావాలన్నా, మొత్తం స్టాక్ పంపిస్తా. ఉన్న స్టైల్స్‌లో నీకు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని డ్యాన్స్ చెయ్” అని ఆ పార్టిసిపెంట్‌కి ఇచ్చారు.
దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ షో సెప్టెంబర్ 11న రాత్రి 9 గంటలకి ప్రసారం కానుంది. కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి కూడా బట్టలు లేవని ఒక బాధ, గెలిస్తే వచ్చే డబ్బుతో అమ్మని కాపాడుకుందామన్న ఆశ మధ్య నలిగిపోతున్న ఆనంద్‌కి విజయ్ దేవరకొండ కొండంత అండగా నిలబడ్డారు. మరి మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.