తెలుగులో ప్రస్తుతమున్న హీరోల్లో విజయ్ దేవరకొండ కాస్త డిఫరెంట్. డ్రస్సింగ్ స్టైల్ విషయంలో కావొచ్చు, సినిమాల సెలక్షన్ లో కావొచ్చు కాస్త కొత్తగా ఉంటాడు. రౌడీ హీరోని కొందరు ఫ్యాన్స్ ట్రోల్ చేసినప్పటికీ.. విజయ్ క్రేజ్ లో పెద్దగా మార్పయితే రావడం లేదు. ‘లైగర్’ లాంటి సినిమాతో గతేడాది ఆగస్టులో ప్రేక్షకుల్ని పలకరించిన విజయ్.. ఎంటర్ టైన్ చేయడంలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలున్నాయి. వాటిలో ఒకటి షూటింగ్ దశలో ఉండగా.. మిగిలిన రెండు కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్తాయి. ఇక షూటింగ్ మధ్యలో దొరికిన ఫ్రీ టైంలో విజయ్ వరస టూర్స్ కి వెళ్తున్నాడు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఓ నెల రోజుల ముందు న్యూయర్ సందర్భంగా మాల్దీవులకు వెళ్లిన విజయ్ దేవరకొండ రీసెంట్ గా దుబాయి వెళ్లి వచ్చాడు. ఆ టూర్ కి సంబంధించిన ఫొటోలు, అందులో రష్మిక కూడా ఉన్నవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి తప్పితే ఎవరూ తమ తమ అకౌంట్స్ లో పోస్ట్ చేయలేదు. ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే.. తాజాగా ఓ దుబాయిలోని ఓ ప్రైవేట్ జూకి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన వీడియోని తాజాగా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో భాగంగా డేంజరస్ క్రూరమృగాల, జంతువులతో గేమ్స్ ఆడుతూ విజయ్ కనిపించాడు.
దుబాయి ట్రిప్ లో భాగంగా ఫేమ్ పార్క్ ని సందర్శించిన విజయ్.. సైఫ్ బెల్సాసా అనే వ్యక్తి ఆర్గనైజ్ చేస్తున్న ప్రైవేట్ జూకి వెళ్లినట్లు చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో చాలా సరదాగా కనిపించిన విజయ్.. పాములని తన మెడలో వేసుకున్నాడు. భారీ ఫైథాన్స్ ని తన ఒంటిపై పాకించుకున్నాడు. అక్కడి పక్షులు, కోతులు లాంటి చిన్న చిన్న జంతువులకు ఫుడ్ తినిపించాడు. బోనులో సింహంతో టగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడాడు. చిన్న పులి పిల్లని మచ్చిక చేసుకుని పాలు కూడా పట్టాడు. మొత్తానికి జంతువులు, పక్షులతో తమ సమయాన్ని పూర్తిగా ఆస్వాదించాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారడంతో విజయ్ అడ్వంచర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి విజయ్ వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.