Liger Movie Trailer: పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ “లైగర్: సాలా క్రాస్ బ్రీడ్”కి సంబంధించిన ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. పూరీ జగన్నాథ్ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన అభిమానులు విజయ్ దేవరకొండ చింపేశాడని, మైండ్ బ్లాక్ అయిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
“ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ట్రైలర్ లో విజయ్ దేవరకొండ రఫ్ లుక్ లో కనబడుతున్నారు. దేశ జాతీయ జెండాను రెండు చేతులతో ఎత్తుకుని నడుచుకుంటూ వచ్చే షాట్ మాత్రం కేక ఉంటుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి.. బాక్సర్ గా ట్రాన్ఫర్మ్ అయ్యేందుకు ఎంత కష్టపడ్డాడో అనేది ట్రైలర్ లో కనబడుతోంది. ఫైట్ సీన్స్ లో విజయ్ పిచ్చెక్కించారు. ఆ స్టంట్స్ ఓ రేంజ్ లో ఉంటాయన్నది ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఇక రమ్యకృష్ణ.. విజయ్ దేవరకొండను తన్నే షాట్ మాత్రం అన్ బిలీవబుల్. ఈ సినిమాలో విజయ్ కి నత్తి ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు, హిందీ ప్రాంతాల నేటివిటీ మిస్ అవ్వకుండా సినిమాని తెరక్కించారని అర్ధమవుతుంది. బాక్సింగ్ రింగ్ లోకి విజయ్ అడుగుపెట్టినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. “ఏయ్ నిక్కర్ వేసిన దగ్గర నుంచి నేను పెద్ద ఫైటర్, మక్కలిరగదీయడంలో నేను ఎప్పుడూ టాపర్” అంటూ సాగే సాంగ్ సూపర్బ్ ఉంది. మణిశర్మ మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
అనన్య పాండే హీరోయిన్ గా, ప్రపంచం గర్వించతగ్గ బాక్సర్ మైక్ టైసన్.. ఈ సినిమాతో ఇండియన్ సినిమాలో పరిచయం కాబోతున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ఈ ట్రైలర్ కి దేశవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. మరి ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.