రౌడీహీరో విజయ్ దేవరకొండ.. ఈ పేరు చెప్పగానే హై ఓల్టేజీ ఎనర్జీ గుర్తొస్తుంది. ఎందుకంటే స్టేజీ ఎక్కి మైక్ పట్టుకుంటే చాలు మనోడు చెలరేగిపోతాడు. ఆ మాటలకే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండోయ్. ‘అర్జున్ రెడ్డి’ రిలీజప్పుడు మొదలైన ఈ రచ్చ.. మొన్నమొన్న వచ్చిన ‘లైగర్’ వరకూ కొనసాగింది. ‘లైగర్’ రిలీజ్ కి ముందు దేశాన్ని ‘షేక్ చేద్దాం’, ‘వాట్ లాగా దేంగే’ లాంటి వాటితో మూవీపై హైప్ బాగా పెంచారు.
ఇక అసలు విషయానికొస్తే.. ‘లైగర్’పై పూర్తి నమ్మకం పెట్టుకున్న దేశం మొత్తం తిరిగి హైప్ వచ్చేలా చేశాడు. కట్ చేస్తే మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. కొన్నిచోట్ల సరిగా కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ మరో మూవీ మొదలుపెట్టేశారు. అదే ‘JGM’. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. ఇక ‘లైగర్’ రిజల్ట్ వల్ల, ఈ సినిమాని పక్కనపెట్టేశారనే వార్తలు.. కొన్నిరోజుల క్రితం వచ్చాయి.
ప్రొడ్యూసర్ ఛార్మీ మాత్రం.. ఎలాంటి పుకార్లని నమ్మొద్దని ట్వీట్ చేసిందే తప్ప, అది ‘జనగణమన’ గురించా కాదా అని క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా జరిగిన ‘సైమా అవార్డ్స్’ ఫంక్షన్ లో పాల్గొన్న విజయ్ కు JGM గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. ‘అవన్నీ ఇప్పుడు ఎందుకు, ఇక్కడికీ అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. సైమా వేడుకల్ని ఎంజాయ్ చేయండి. దాని గురించి మర్చిపోండి’ అన్నాడు. ఇది చూసిన రౌడీ ఫ్యాన్స్ అయోమయంలో పడిపోయారు. విజయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: విజయ్ తో ‘జనగణమన’ మూవీని పక్కన పెట్టేసిన పూరి జగన్నాథ్..?
ఇదీ చదవండి: మాపై రూమర్స్ ఆపండి! మేము మళ్ళీ తిరిగొస్తాము: ఛార్మి