తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ అయ్యారు. ఆయన బాటలో ఎంతో మంది వచ్చారు.. కానీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. కోలీవుడ్ లో శివకార్తికేయన్ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతున్నాడు. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘ప్రిన్స్’ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అనుదీప్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ప్రిన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రావడం ఎంతో సంతోషంగా ఉంది.. కెరీర్ బిగినింగ్ లో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ఎవడే సుబ్రమణ్యం’ మూవీ షూటింగ్ సమయంలో అనుదీప్ ప్రస్తావన వచ్చేది.. ఆ సయంలో అతను తీసిన షార్ట్ ఫిలిమ్స్ చూసి నేను, నాగ్ అశ్విన్ ఎంతో నవ్వుకునేవాళ్లం. నాకు ఎప్పుడైనా మనసు బాగాలేకపోయినా.. బోర్ కొట్టినా అనుదీప్ వీడియోలు చూసి రిలాక్స్ అవుతాను. జాతి రత్నాలు తర్వాత ‘ప్రిన్స్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇండస్ట్రీలో అనుదీప్ కి మంచి అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటున్నా.
శివ కార్తికేయన్ విషయానికి వస్తే.. నేను ఆయన్ని ఫస్ట్ టైమ్ డైరెక్ట్ గా కలుస్తున్నాను. మొదటి సారిగా నేను ‘రెమో’ మూవీ నర్స్ గెటప్ లో ఉన్న పోస్టర్స్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. కాలేజీ చదువు పూర్తి చేసిన తర్వాత ఆయన ఐదేళ్ల పాటు బుల్లితెరపై పనిచేసి.. తర్వాత ఇండస్ట్రీలోకి చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కి ఎదగడం అనేది ఎంతో గొప్ప విషయం. నటులు అందరూ సినిమా కోసం ప్రాణం పెడతారని ఒక స్టేజ్ పై శివకార్తికేయన్ ఏడ్చారు.. అప్పుడు నా మనసు ఎంతో బాధపడింది.. అప్పుడే నిర్ణయం తీసుకున్నా.. శివ కార్తికేయన్ కి అవసరమైనపుడు తోడుగా నిలవాలని.. అందుకే ప్రిన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చానని’విజయ్ దేవరకొండ అన్నారు. గత కొంత కాలంగా తెలుగు, తమిళ భాషల్లో శివకార్తికేయన్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.