ట్రిపులార్ సినిమా.. టాలీవుడ్, పాన్ ఇండియా లెవల్లోనే కాదు హాలీవుడ్ లెవల్లో సత్తా చాటింది. ఇప్పటికీ ఓటీటీలో ఈ సినిమా దూసుకుపోతోంది. నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటకీ సోషల్ మీడియాలో ట్రిపులార్‌ను విదేశీ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతూనే ఉన్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులు మంత్రముగ్దులైపోయారు.
ట్రిపులార్ సినిమా ఆస్కర్ బరిలో ఉండచ్చని చెబుతున్నారు. ఆస్కార్ ప్రిడిక్షన్స్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ పేరును చెబుతున్నారు. ఆస్కార్ బరిలో బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో ట్రిపులార్ సినిమా నుంచి ఎన్టీఆర్‌కు అవకాశం దక్కుతుందంటూ వార్తలు చాలా వచ్చాయి. అయితే ఈ వార్తలు, ప్రాచారాలపై విజయ్ దేవరకొండను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
“తారక్ అన్నకు ఆస్కార్ రావాలి. ఆయన ఆస్కార్ గెలవాలని కోరుకుంటున్నాను. నిజంగా అలా జరిగితే మెంటల్ ఉంటుంది. మనదేశం నుంచి మనవాళ్లు ఎవరైనా అలా గెలిస్తే ఆ ఆనందమే వేరుంటుంది. అదేనిజమై ఆస్కార్ కొడితే అంతకన్నా ఏం కావాలి. ట్రిపులార్ సినిమాలో రామ్ చరణ్ అన్న, తారక్ అన్న డెడ్లీ పర్ఫామెన్స్, కిల్లర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు” అంటూ విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#VijayDeverakonda reacts on #NTRForOscars
I want him to win..let’s go..I think if #Tarak anna wins it will be mental. I really hope we can win. And deadly performance in the movie.Both, @AlwaysRamCharan anna , @tarak9999 anna gave killer performances.👍 pic.twitter.com/EZSLWfkEUx
— Suresh Kondi (@SureshKondi_) August 19, 2022