రౌడీ హీరో విజయ్ దేవరకొండకు హీరోయిన్ రష్మికతో పెళ్లయిపోయిందా? సోషల్ మీడియా అంతా దీని గురించి ఒకటే డిస్కషన్. ఎందుకంటే వీళ్లిద్దరి కలిసి చేసింది రెండే సినిమాలు. కానీ క్రేజ్ మాత్రం 20 సినిమాలకు సరిపడా తెచ్చుకున్నారు. ఇప్పటికీ వీళ్లు జంటగా కనిపించిన ప్రతిసారి హాట్ టాపిక్ అవుతుంది. ఎందుకంటే వీళ్ల జోడికి ఉన్న ఫేమ్ అలాంటిది. ప్రస్తుతం వీళ్లు ఎవరికి వారు సినిమాలు చేస్తూ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ విజయ్-రష్మికకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. చిన్న చిన్న రోల్స్ చేసుకుంటా స్టార్ హీరోగా ఎదిగిన పర్సన్ విజయ్ దేవరకొండ. హిట్ ప్లాఫ్ సంగతి పక్కనబెడితే… అతడి క్రేజ్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరోవైపు కన్నడ బ్యూటీ రష్మిక కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఐదారేళ్లు మాత్రమే అవుతోంది. అయినా సరే పాన్ ఇండియా లెవల్ క్రేజ్ సంపాదించింది. ఇక వీళ్లిద్దరూ ‘గీతగోవిందం’ , ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలు చేశారు. ఈ రెండింట్లోనూ అద్భుతమైన కెమిస్ట్రీ వర్కౌట్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని గుసగుసలు మొదలయ్యాయి.
దానికి తగ్గట్లే బెంగళూరులో రెస్టారెంట్ లో ఓసారి కలిసి కనిపించారు. మొన్నటికి మొన్న మాల్దీవులు ట్రిప్ కి కూడా జంటగానే వెళ్లారు. ఆ విషయం వాళ్లు చెప్పనప్పటికీ.. ఫ్యాన్స్ మాత్రం పసిగట్టేశారు. ఇక విజయ్ ఫ్యామిలీతోనూ రష్మికకు మంచి బాండింగే ఉంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు డిస్కషన్ వస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అలానే విజయ్-రష్మిక పెళ్లి చేసుకున్నట్లు ఓ ఫ్యాన్ మేడ్ ఫొటో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ‘ఇది ఇప్పుడు ఎడిటింగ్ కావొచ్చు. ఫ్యూచర్ లో మాత్రం నిజమవుతుంది’ అని పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోపై విజయ్, రష్మికలలో ఎవరో ఒకరు స్పందిస్తే గానీ అసలు విషయం బయటకు రాదు. మరి ఈ ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
View this post on Instagram
A post shared by vijay_deverakonda_die_hard_fan (@vijay_deverakonda_die_hard_fan)
View this post on Instagram
A post shared by vijay_deverakonda_die_hard_fan (@vijay_deverakonda_die_hard_fan)