టాలీవుడ్ లో ఇప్పుడు ఎందరో హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వస్తే మరికొందరు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలోకి వచ్చారు. అలాంటి వారిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే ఇలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి విజయ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ కెరీర్ నే మలుపు తిప్పి.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. అయితే విజయ్ కి అర్జున్ రెడ్డి కంటే ముందు ఓ సినిమాతో గుర్తింపు వచ్చింది. అదే నాని హీరోగా నటించిన “ఎవడే సుబ్రహ్మణ్యం”. ఇందులో ‘రుషి’ పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ని ఆడిషన్ చేశారు. ఈ ఆడిషనే విజయ్ కెరీర్ ని మలుపు తిప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా చేస్తున్నాడు. విజయ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. మరో వైపు జనగణమన, ఖుషి సినిమాల షూటింగ్ లో విజయ్ బిజి బిజీగా ఉన్నాడు. విజయ్ అంటే అమ్మాయిలకు తెగ ఇష్టం. అందుకే విజయ్ దేవరకొండకి అమ్మాయిల్లో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. అనేక అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. ఇంతలా క్రేజ్ సంపాదించిన ఈ హీరోకి మొదట “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో పేరు వచ్చింది. అందులో చేసిన హీరో స్నేహితుడు రిషి పాత్రలో నటించి అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ఈ రౌడీ హీరో విజయ్.. “ఎవడే సుబ్రహ్మణ్యం” కంటే ముందు నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి సినిమాల్లో నటించాడు. “ఎవడే సుబ్రహ్మణ్యం”సినిమాకు విజయ్ స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నాడు. ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.
అనంతరం విజయ్ హీరోగా వచ్చిన.. మొదటి సినిమా పెళ్లి చూపులు సూపర్ సక్సెస్ కావడం.. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్టర్ కావడం వల్ల విజయ్ పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. ఆ తర్వాత విజయ్ నటించిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ కావడం జరిగింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి ఈ రౌడీ హీరో ఎదిగాడు. అయితే ఇంతలా గుర్తింపు తెచ్చిన “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమా కోసం నాగ్ అశ్విన్.. విజయ్ దేవరకొండను ఆడిషన్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Rashmika Mandanna: ఆ హీరోయిన్ ఇంట్లో పూజలు చేశా.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!
ఇదీ చదవండి: Sushmita Sen: ప్రేమకి వయసుకి సంబంధం ఏమిటి? అయినా.. ఆడవాళ్లే మీ టార్గెటా?
ఇదీ చదవండి: బికినీ వీడియో పోస్ట్ చేసిన ప్రణీత..! కమ్ బ్యాక్ కోసమా?