తమిళ స్టార్ హీరో సూర్య తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ET’. ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ మార్చి 10న తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల కానుంది. ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. ఇక ఇటీవలే హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ET టీజర్‌ను విడుదల చేశారు. కాగా.., ఈ బుధవారం పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ “ఈటి” సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు పంపారు.
ఇది కూడా చదవండి : రౌడీ స్టార్ ‘దేవరశాంటా’ విన్నర్స్ వీరే.. ఒక్కొక్కరికి 10 వేల ప్రైజ్ మనీ!
‘”ఈటి” తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా వుంది. రాక్ సాలిడ్‌గా లుక్ కనిపిస్తోంది. నాకు ఇష్టమైన హీరో సూర్యకు `ఎవరికి తలవంచడు`చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని విజయ్ పోస్ట్ చేశాడు. ఈ సినిమాలో ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూడాలనుకునే సామాజిక పోరాట యోధుడిగా సూర్య నటించారు. అతని గర్ల్ ఫ్రెండ్ గా ప్రియాంక అరుల్ మోహన్ బబ్లీ గా ఉండే పాత్ర పోషించింది. సామరస్యంగా వున్న ఓ గ్రామంలోని మహిళలను ఒక నేరస్థుడు అతని ముఠా లక్ష్యంగా చేసుకోవడంతో ఆ ఊరిలో సామరస్యం దెబ్బతింటుంది. దాన్ని తిరిగి తీసుకురావడానికి కథానాయకుడు ఎటువంటి చర్య తీసుకున్నాడనేది కథ ప్రధాన ఇతివృత్తంగా రూపొందింది. మరి.. సూర్య ఇంటెన్సివ్, పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్ లో నటించిన ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.
Taking absolute pleasure in launching the #ETTeluguTrailer 🙂https://t.co/INegr2HKsG
This Looks Rock Solid! My Best wishes to one of my favourites, dearest @Suriya_offl anna😊 & the team of #EvarikiThalaVanchadu❤️@priyankaamohan @pandiraj_dir @AsianCinemas_ @sunpictures #ET
— Vijay Deverakonda (@TheDeverakonda) March 2, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.