గత కొంతకాలంగా నుంచి రష్మిక, విజయ్ దేవరకొండకు సంబందించిన న్యూస్ ఎంతగా వైరల్ అవుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో విజయ్ ఫ్యాన్స్ రష్మికకు షాకిచ్చారు.
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమాయణాలపై కొందరు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంటారు. అలానే నిత్యం సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుంటాయి. అలా గత కొంతకాలంగా రష్మిక, విజయ్ దేవరకొండకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ వార్తను వారిద్దరు ఎక్కడ ఖండిచాను లేదు. తాజాగా రష్మికకు విజయ్ అభిమానులు షాకిచ్చారు.
రౌడీ హీరో, విజయ్ దేవర కొండ తమ్ముడు ఆనంద్ దేవర కొండ నడిస్తున్న తాజా మూవీ బేబి. ఈ సినిమాలో ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీతో సాయిరాజేశ్ అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇక సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ఇటీవలే హైదరాబాద్ లోని పీవీఆర్ ఆర్కే స్క్రీన్ లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నేషనల్ క్రష్, కన్నడ బ్యూటీ రష్మిక హాజరయ్యారు. ఈ అమ్మడే స్వయంగా సాంగ్ ను రిలీజ్ చేసింది. అనంతరం సినిమా గురించి, నటీనటుల గురించి రష్మిక మాట్లాడారు. ఈ బ్యూటీ మాట్లాడుతున్న సమయంలో విజయ్ అభిమానులు నానా హంగామా చేశారు. వదినా..వదినా అంటూ ఈలలు వేస్తూ గోల చేశారు. విజయ్, రష్మికలపై వస్తున్న వార్తలు నిజమైతే.. ఆనంద్ దేవరకొండకు ఈ అమ్మడు వదిన అవుతుంది. కాబట్టి.. అతడికి సపోర్టు చేయడానికి రష్మిక వచ్చిందనే అర్ధం వచ్చేలా విజయ్ ఫ్యాన్స్ అరుపులు ప్రారంభించారు. విజయ్ అభిమానులు అంత రచ్చ చేసినా… రష్మిక ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కేవలం చిరు నవ్వు చిందిస్తూ అలా ఉండి పోయింది. అలా ఉందంటే.. ఆమె ప్రేమ విషయం నిజమే కావచ్చంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి.. విజయ్ ఫ్యాన్స్.. రష్మికను వదినా అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.