సినీ ఇండస్ట్రీలోని పాపులర్ సెలబ్రిటీలు ఎప్పుడైనా ఒకే స్క్రీన్ లో కనిపిస్తే అభిమానులకు కనులవిందుగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ హీరోయిన్ అనన్య పాండే కలిసి చేసిన ఇన్ స్టాగ్రామ్ డాన్స్ రీల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అయితే.. విజయ్ – అనన్య ఇద్దరూ కూడా త్వరలోనే లైగర్ సినిమాతో జంటగా పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ చేసిన డాన్స్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి, బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 25న లైగర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాపై విజయ్ – అనన్యల కొత్త వీడియో హైప్ పెంచిందని చెప్పాలి.
తాజా సమాచారం ప్రకారం.. త్వరలోనే విజయ్, అనన్య పాండే కలిసి “కాఫీ విత్ కరణ్ సీజన్-7” షోలో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే కరణ్ షో షూటింగ్ ముగించిన తర్వాత వీరిద్దరూ ఇన్ స్టాగ్రామ్ రీల్ చేశారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇద్దరూ కలిసి వరుణ్ ధావన్, కియారా అద్వానీ కలిసి ఆడిపాడిన ‘ది పంజాబ్బన్’ సాంగ్ బీట్ కి డాన్స్ చేయడం మనం చూడవచ్చు. వీడియోలో విజయ్ సూట్ ధరించగా, అనన్య ఎల్లో కలర్ మినీ డ్రెస్ లో కనిపించింది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది కాఫీ విత్ కరణ్ షో టీవీలో ప్రసారం కాదని తెలుస్తుంది. ఇకనుండి డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రసారం కాబోతుందట. హోస్ట్ కరణ్ జోహార్ గత రెండు వారాలుగా షో షూటింగ్ లో ఉన్నారు. త్వరలోనే విజయ్ – అనన్యల ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో రానుందని టాక్. మరి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న విజయ్ – అనన్యల డాన్స్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.