చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు ఆ మూవీ పై అంచనాలు భారీగా ఉంటాయి. తాజాగా అలాంటి అంచనాల నడుమ విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న సినిమా ‘లైగర్’ (సాలా క్రాస్ బ్రీడ్). దీంతో ఆ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో ఈవెంట్స్ నిర్వహిస్తూ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగానే రాజస్తాన్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
విజయ్ దేవరకొండ.. రౌడీ బాయ్ గా ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో మనందరికి తెలిసిందే. ప్రత్యేకంగా అమ్మాయిలు విజయ్ అంటే పడిచచ్చిపోతారు. ఈక్రమంలో వేడుకల్లోనే కొన్ని సార్లు ప్రపోజ్ చేసిన సంఘటనలూ మనం చూశాం. తాజాగా రాజస్తాన్ లోని పారుల్ యూనివర్సీటిలో నిర్వహించిన లైగర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న విజయ్, అనన్య పాండేలు తమదైన శైలిలో రచ్చ రచ్చ చేశారు.
లైగర్ కార్ క్యాంపస్ లోకి రాగానే పూల వర్షం కురిపించారు. విజయ్, అనన్యలు కార్ పైనుంచే అభివాదం చేశారు. ఇక స్టూడెంట్స్ కోలాహలంతో అక్కడ అంతా పండగ వాతావరణం నెలకొంది. రౌడీ హీరో స్టేజ్ పై నుంచే మూవీలోని ఓ డైలాగ్ ను స్టూడెంట్స్ తో చెప్పించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇక్కడే ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. విజయ్ కు ఓ అమ్మాయి మోకాలిపై కూర్చోని ప్రపోజ్ చేసింది. విజయ్ ఆమెను ముద్దు పెట్టుకుని హత్తుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ యువతి ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. రౌడీ బాయ్ కోసం వారు తెచ్చిన గిఫ్ట్ లను అతనికి అందజేశారు.
అనన్య మాట్లాడుతూ..”ఐ లవ్ యూ.. అండ్ ఐ లవ్ దట్ పోస్టర్స్” అంటూ కుర్రాళ్లను కవ్వించింది. ఆమె కోసం తెచ్చిన బహుమతులను అందుకుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కరణ్ జోహర్, పూరీ, చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 25 న విడుదల కానుంది. ఈ మూవీలోప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ కీలక పాత్ర చేయడం విశేషం. అలాగే రమ్యకృష్ణ విజయ్ కు తల్లిగా నటించారు. మరి విజయ్ దేవరకొండ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.