లైగర్.. పాన్ ఇండియా లెవల్లో ప్రస్తుతం ఈ సినిమా పేరు మారుమ్రోగుతోంది. బాలీవుడ్‌లో అయితే ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. యూఎఫ్‌సీ ఫైటర్‌గా కనిపించబోతున్న విజయ్ దేవరకొండ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నార్త్ లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ పర్సనల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎప్పటి నుంచో విజయ్- రష్మిక రిలేషన్లో ఉన్నారంటూ వార్తలు రావడం, వాటిపై రష్మిక పదే పదే మేం మిత్రులమే అంటూ స్పందించడం చూశాం. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన రిప్లైతో ఆ వాదనపై క్లారిటీ వచ్చింది అంటున్నారు.
విజయ్ రిలేషన్‌పై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. “ అవును నేను డేటింగ్‌లో ఉన్న మాట వాస్తవమే. నా పర్సనల్ లైఫ్‌ని బయటపెట్టడం నాకు ఇష్టం ఉండదు. ఒక నటుడిగా పబ్లిక్‌లో ఉండటం నాకు ఇష్టమే. కానీ, అది ఆమెకు నచ్చకపోవచ్చు. అందుకే ఆమె స్వేచ్ఛకు బంగం కలిగించాలి అనుకోవడం లేదు” అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు అయితే విజయ్ డేటింగ్ చేసిది ఇండస్ట్రీలో వ్యక్తి కాదని అర్థమైపోతోంది. రౌడీ బాయ్ లవ్ లైఫ్ విషయంలో వచ్చే రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అయ్యింది అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే అసలు ఆమె ఎవరు? ఏం చేస్తుంటుంది అనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.