లైగర్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాక్. పాన్ ఇండియా స్థాయిలో పూరీ- విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన బజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడికి వెళ్లినా రౌడీ హీరోకి ఘన స్వాగతం లభిస్తోంది. తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. బాలీవుడ్‌లో అయితే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆగస్టు 25న సినిమా విడుదల కానుండటంతో ప్రచారంలో జోరు పెంచారు.
ఇప్పటివరకు నార్త్ లో ప్రమోషన్స్ చేసిన చిత్ర బృందం ఇప్పుడు సౌత్‌పై దృష్టి పెట్టారు. వరంగల్‌లో ఆదివారం ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు. “మాపై మీరు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ఆగస్టు 25న మీకు తిరిగి ఆ ప్రేమను ఇచ్చేస్తాం. సగం దేశం తిరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాం. ఎక్కడ తిరిగినా ఇక్కడి వాళ్లు ఏమనుకుంటున్నారో అనే ఆలోయన ఉంటుంది. సినిమా మీద ఎలాంటి డౌట్ లేదు బ్లాబ్లా బ్లాక్ బస్టర్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
“ఆంధ్రా, తెలంగాణలో షేక్ చేస్తే ఇండియా మొత్తం వినిపించాలి. అమ్మాకొడుకు కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్తారు. కొడుకుని ఆ అమ్మ ఛాంపియన్‌ని చేయాలని అనుకుంటంది. అలాగే మేము కూడా హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్లాం. పూరీ మా నాన్నలా.. చార్మీ మా అమ్మలా.. ముగ్గురం ఇండియాని షేక్ చేద్దామని ముంబై వెళ్లాం. నన్ను సూపర్ స్టార్ అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉంది. ఆ పేరుకు తగినంతగా ఇంకా చేయలేదు, చేయాలి.” అంటూ వ్యాఖ్యానించాడు.
“పూరీ జగన్నాథ్ రాసే డైలాగులు చెప్పాలంటే అదృష్టం, దేవుడి ఆశీస్సులు ఉండాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. వీ ఆర్ ఇండియన్స్.. పోదాం కొట్లాడదాం.. ఆగ్ హై అందర్.. దునియా ఆగ్ లగా దేంగే.. వాట్ లగాదేంగే అని డైలాగ్ ఉంది. దానికి నేను ఎంతో కనెక్ట్ అయ్యాను” అంటూ విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. విజయ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.