నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్, పూజా హెగ్డే.. హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బీస్ట్’. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13న పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ ఫస్ట్ డే కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఓవైపు ఈ సినిమా సూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు విజయ్ అభిమానులు సినిమా నచ్చలేదంటూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి బీస్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఓ షాపింగ్ మాల్ లో ఉన్న జనాలను కొందరు టెర్రరిస్టులు బందీలుగా చేసుకుంటారు. దీంతో మాజీ ‘రా ఏజెంట్’ అయిన విజయ్ వారిని ఎలా రక్షించారనేది ఈ మూవీ కథాంశం. ఈ చిత్రంలో విజయ్.. వీర రాఘవన్ పాత్రలో కనిపించారు. పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ సినిమా తమిళనాడులో నిన్న ఉదయం 4 గంటలకే తొలి షో ప్రారంభమయ్యింది.
ఇది కూడా చదవండి: బీస్ట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే!ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. తెలుగు, తమిళ వర్షన్ హక్కులు ఓవర్సీస్ లో పెద్ద మొత్తంలో అమ్ముడు పోయాయి. అలాగే లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీ నైజాంలో రూ.3 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలాగే సీడెడ్ లో రూ. 2.2 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.50 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో తొలిరోజు రూ. 6-7 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజే.. రూ. 30 నుంచి 35 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ. 50- 52 కోట్ల మార్క్ దాటేసిందని టాక్. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే.. రూ.65 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్ వినిపిస్తోంది.
#Beast ALL TIME RECORD 1st Day Gross in Tamilnadu at ₹36 Cr Approx! Sensational Opening Day. https://t.co/Z07LN6hcm7
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 14, 2022
#Beast First day tamilnadu theatrical Gross break down.
Chennai – 2C
Chengelpet – 10C
North&South Arcot – 5C
Coimbatore – 5.9 C
Salem – 3.8 C
Madurai – 4.9 C
Trichy – 3.6 C
TK – 3C38.2 Crores theatrical Gross on 1st day ! All time record!
From reputed distributors!
— Prashanth Rangaswamy (@itisprashanth) April 14, 2022
What’s round the corner? The Beast release! 2 days to go! 💃🏻 #Beast #raw #arabickuthu #jollyogymkhana pic.twitter.com/0G782kA7x3
— Pooja Hegde (@hegdepooja) April 10, 2022