కొంతమంది హీరోలు అప్పుడప్పుడు.. సామాన్యుల మాదిరి, లేదంటే.. వేర్వురు గెటప్‌లలో బయటకు వచ్చి జనాలను సర్‌ప్రైజ్ చేస్తారు. ఇక తాజాగా స్టార్ హీరో ఒకరు హోటల్లో వెయిటర్‌గా మారి అందరికి షాకిచ్చాడు. ఆ వివరాలు..
మన దేశంలో సినిమా తారలు అంటే ఒక రకంగా చెప్పాలంటే దైవాంశసంభూతులుగానే పరిగణించబడతారు. ప్రతి హీరో, హీరోయిన్‌కు ఓ రేంజ్‌లో అభిమానులు, ఫాలోయింగ్ ఉంటుంది. అందుకే వారు సెక్యూరిటీ లేకుండా.. సామాన్యుల మాదిరి కాలు బయట పెడితే.. పోలోమంటూ చుట్టూ అభిమానులు చేరి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అందుకే వారు ఎక్కువగా బహిరంగ ప్రదేశాలకు రారు. వచ్చిన చుట్టూ గార్డ్స్ ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. లేకపోతే సెల్ఫీలు అంటూ అభిమానులు ఎగబడిపోయి ఊపిరాడకుండా చేస్తారు. సినిమా తారలకు మన దగ్గర ఈ రేంజ్‌లో అభిమానులుంటారు.ఘిది ఇలా ఉండగా తాజాగా ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. స్టార్ హీరో ఒకరు హోటల్లో వెయిటర్‌గా మారి.. కస్టమర్ల దగ్గర ఆర్డర్ తీసుకోవడమే కాక.. తానే స్వయంగా వారికి వడ్డించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
మరి ఇలా వెయిటర్‌గా మారిన ఆ హీరో ఎవరంటే.. విజయ్ ఆంటోని. తాజాగా బిచ్చగాడు 2 చిత్రం ద్వారా.. ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించాడు విజయ్ ఆంటోని. తొలి రోజు నుంచే ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తాజాగా విజయ్ ఆంటోని ఓ హోటల్‌లో వెయిటర్ అవతారం ఎత్తాడు. మాస్క్ పెట్టుకుని ఉండటంతో.. ఆయన ఎవరో ముందుగా కస్టమర్లు గుర్తించలేదు. ఆ తర్వాత విజయ్ ఆంటోని అని తెలియడంతో.. ఆయనతో సెల్ఫీ కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది.
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఉన్నట్లుండి సడెన్‌గా హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో ప్రత్యక్షమయ్యాడు. మణికొండలో ఉన్న 1980 మిలటరీ హోటల్ పేరుతో ఉన్న రెస్టారెంట్‌గా వెయిటర్ అవతారం ఎత్తాడు విజయ్ ఆంటోని. సినిమాలో నటించినట్లుగానే రియల్ లైఫ్‌లో కూడా హీరో కస్టమర్లకు బిర్యానీ ప్లేట్లు, ఫుడ్ ఐటమ్స్ సప్లై చేశాడు. సినిమా సక్సెస్ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనితో పాటు చిత్ర బృందం కూడా హోటల్‌ని విజిట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరలవుతున్నాయి.
తెర మీద కనిపించే విజయ్ ఆంటోని.. డైరెక్ట్‌గా హోటల్‌కి రావడం, అందులో వెయిటర్ డ్రెస్ వేసుకొని తమకు వడ్డన చేయడం చూసి కస్టమర్లు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భాన్ని మరుపురాని జ్ఞాపకంగా మార్చుకోవాలని భావించి.. హీరో తమకు సర్వ్ చేస్తుండగా.. ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత హీరోతో సెల్ఫీలు దిగడం కోసం ఎగబడ్డారు. నిమిషాల్లోనే ఈ వార్త.. వైరల్‌గా మారడంతో.. చాలా మంది కస్టమర్లు విజ్ ఆంటోని చూడటం కోసం హోటల్‌కి వచ్చారు. విజయ్ ఆంటోని వెయిటర్‌గా మారిన వీడియో ఇప్పుడు వైరలవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.