విజయ్ ఆంధోనీ.. నకిలీ, డాక్టర్ సలీం వంటి సినిమాలతో మెప్పించిన.. ఆయన బిచ్చగాడి(పిచ్చైకారన్)తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సైతాన్, కాళి, తమిళరాసన్ వంటి సినిమాలు చేసినా చెప్పుకో తగ్గ గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు బిచ్చగాడి-2 మీదే ఆయన ఆశలను పెట్టుకున్నాడు. ఆయన ఈ సినిమా షూటింగ్ లో గాయపడిన సంగతి విదితమే.. అయితే..
హీరో కమ్ డైరెక్టర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ గేయ రచయిత కమ్ ప్లే బ్యాక్ సింగర్ ఇలా 24 క్రాఫ్టులో సగం విభాగాల్లో అనుభవం ఉన్న నటుడు విజయ్ ఆంథోనీ. తెలుగు సినిమాలకు కూడా ఆయన సుపరిచితమే. మహాత్మ, దరువు చిత్రాలకు ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. తమిళంలో కూడా బడా హీరోలకు సంగీతాన్ని అందించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. నటుడిగా, డైరెక్టర్‌గా మారాడు. డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగులోకి పరిచయమయ్యాడు. నకిలీ, డాక్టర్ సలీం వంటి సినిమాలతో మెప్పించిన.. ఆయన బిచ్చగాడి(పిచ్చైకారన్)తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సైతాన్, కాళి, తమిళరాసన్ వంటి సినిమాలు చేసినా చెప్పుకో తగ్గ గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు బిచ్చగాడి-2 మీదే ఆయన ఆశలను పెట్టుకున్నాడు.
అయితే ఈ షూటింగ్ సమయంలో ఆయనకు పెద్ద ప్రమాదం జరగ్గా.. చావు అంచుల వరకు వెళ్లి వచ్చారని మీడియా కోడై కూసింది. తర్వాత కోలుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అయితే ఫైట్ చేస్తుండగా.. ఆయన ప్రమాదానికి గురైనట్లు అందరూ భావించారు. కాగా, ఈ విషయంపై ఆయన విజయ్ ఆంథోనీ స్పందించారు. ఈ నెల 19న పిచ్చైకారన్ 2′ (‘బిచ్చగాడు 2) విడుదల కాబోతుండగా.. చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. అప్పుడు తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. ‘సాధారణంగా ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో నటీనటులు గాయపడుతుంటారు. కానీ, నేను హీరోయిన్‌తో రొమాన్స్ చేసే సన్నివేశ సమయంలో గాయపడ్డాను. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సముద్రంలో పడిపోయిన నన్ను హీరోయిన్ కావ్యథాపర్, కెమెరామెన్ అసిస్టెంట్స్ రక్షించారు’అని చెప్పారు
ఈ చిత్రం ‘పిచ్చైకారన్’ కథకు సీక్వెల్ కాదని, ఇది వేరే స్టోరీ అని, ఎమోషన్స్ పుష్కలంగా ఉంటాయన్నారు. క్లైమాక్స్ సన్నివేశంలో కచ్చితంగా ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటారు. ఈ చిత్రానికి తానే దర్శకత్వం, సంగీతాన్ని అందించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో విజయ్ , అజిత్ వంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలని ఉందని ఆయన తెలిపారు. విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానరుపై ఆయన భార్య, నిర్మాత ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మెప్పించింది. రాధారవి, వైజీ మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీశ్ పెరాడి, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు నటించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.