మన ఫేవరెట్ హీరో హీరోయిన్లు జోడి కడుతున్నారంటే ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాల్సిందే. టాలీవుడ్‌లో అటువంటి కాంబోలకు కొదవ లేదు. ఈ కాంబోలు మళ్లీ మళ్లీ రిపీట్ అయినా జనాలు చూస్తారు. అటువంటి మూవీనే ఖుషి. పవన్ కళ్యాణ్ పాత సినిమా పేరుతో వస్తున్న ఈ సరికొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించిందీ చిత్ర నిర్మాణ సంస్థ
ఓ సినిమా వస్తుందంటే ముందుగా చూసేది హీరో హీరోయిన్లు. ఆ తర్వాత దర్శకుడు, బ్యానర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకునేది. కథ, స్క్రీన్ ప్లే అనేది సినిమా విడుదలయ్యాక చూసి తరించి హిట్టా, ఫట్టా చెబుతాం. మన ఫేవరెట్ హీరో హీరోయిన్లు జోడి కడుతున్నారంటే ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేయాల్సిందే. టాలీవుడ్‌లో అటువంటి కాంబోలకు కొదవ లేదు. ఈ కాంబోలు మళ్లీ మళ్లీ రిపీట్ అయినా జనాలు చూస్తారు. అయితే సినిమా అన్సౌన్స్‌మెంట్ నుండి కొన్ని సినిమాలు హైప్‌ను క్రియేట్ చేస్తాయి. అటువంటి మూవీస్‌లో ఒకటి ఖుషి. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ సినిమాలతో మెప్పించిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
లైగర్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసిన విజయ్ దేవర కొండకు ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకం. ఈ షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ.. మయసైటిస్‌తో సమంత బాధపడుతుండటంతో చిత్రీకరణకు బ్రేక్ పడింది. కోలుకున్న అనంతరం షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆప్ డేట్‌ను ఇచ్చింది నిర్మాణ సంస్థ. ఖుషి సినిమాను వినాయక చవితి కానుకగా 1 సెప్టెంబర్ న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. దానికి సంబంధించిన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. విజయ్ దేవర కొండ, సమంత కాంబోలో సినిమాలు వస్తుందని అనౌన్స్ రాగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే మూవీకి సంబంధించిన అప్ డేట్ వచ్చింది.
తన ఫేవరేట్ హీరోయిన్ సమంత అని పలుమార్లు విజయ్ దేవరకొండ బహిరంగంగానే ప్రకటించారు. మోస్ట్ టాలెండెట్ అంటూ ఓ షోలో కూడా ఆమెను మోసేశారు. అయితే వీరిద్దరూ గతంలో మహానటి సినిమాలో కలిసి నటించారు. చేసిన నిడివి తక్కువే అయినప్పటికీ.. ఆ కాంబో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరూ ఫుల్ లెంగ్త్ రోల్స్ లో కనువిందు చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ తో పాటు పలు ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. కాగా, యశోదతో సక్సెస్ అందుకున్న సామ్‌కు ఈ సినిమా కీలకం. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ శాకుంతలం కూడా వాయిదా పడుతూ వస్తుంది. ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు చిత్ర మేకర్స్. గత ఏడాది ఒక్క సినిమాతోనే పలకరించిన సామ్.. ఈ ఏడాది రెండు సినిమాలతో రాబోతున్నారు. ఖుషి పలు భాషల్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.