2015లో విఘ్నేష్ దర్వకత్వం వహించిన ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సెట్స్ నుంచే వీళ్ల ప్రేమ మొదలైందని చెప్పచ్చు. సినిమా చిత్రీకరణ సమయంలో ఒకరినొకరు ఇష్టపడిన ఈ ముద్దుల జంట గాఢమైన ప్రేమలో మునిగిపోయారు. నయనతార ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి 19 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె తరువాత ఎంతోమంది క్రేజీ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ నయనతార సూపర్ హీరోయిన్ గా తన ఆధిపత్యాన్ని ఇప్పటికీ కొనసాగిస్తోంది.
4 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే ఈమె నటించిన సినిమాల ప్రమోషన్ ను కూడ చేయదు. వ్యక్తిగతంగా నయనతార జీవితం పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రూమర్లు వచ్చాయి. ప్రభుదేవా, శింభు లతో ప్రేమాయణం కొనసాగించి పెళ్ళి వరకు వెళ్ళి చివరకు బ్రేకప్ చేసుకుని సంచలన వార్తలకు నిరంతరం చిరునామాగా కొనసాగుతోంది. తనకన్నా వయసులో చిన్న వాడైన దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్ళి పీటల వైపు అడుగులు వేస్తోంది.
ఓ టీవీ షోలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘ఇదిగో ఇదే నా నిశ్చితార్థపు ఉంగరం. వ్యక్తిగత విషయాల గురించి బయటికి చెప్పడం నాకు, విఘ్నేష్‌కు పెద్దగా నచ్చదు. వేడుకల్నీ నిరాడంబరంగా జరుపుకోవ డానికే ఇష్టపడతాం. అందుకే ఎంగేజ్‌మెంట్ కూడా మా దగ్గరి కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా చేసుకున్నాం. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు. ఫిక్సయ్యాక తప్పకుండా మీ అందరికీ చెబుతా. ఇద్దరికీ వృత్తిపరంగా కొన్ని లక్ష్యాలున్నాయి. అందుకే ఇప్పటిదాకా పెళ్లి గురించి ఆలోచించలేదు..’ అంది నయన్.
విఘ్నేష్ శివన్ – నయనతార… వార్తల్లోనే ఉంటారు వీళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేసారు. వరసగా ఈ మధ్య దైవ దర్శనాలతో బిజీగా మారిపోయారు ఈ జోడీ. ఈ మధ్య ఎక్కడ చూసినా.. ఏ గుళ్లో చూసినా కూడా నయన్, విఘ్నేష్ జంట కనిపిస్తుంది. ఓవైపు గుళ్లు మాత్రమే కాదు మరోవైపు పార్టీలు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఈ జోడీ. ఎప్పటికప్పుడు వీళ్ల పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి.
ప్రస్తుతం విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తోంది నయన్. ఇది ఎంతవరకూ నిజం అన్నదీ కాలమే నిర్ణయించాలి.
🤩🤩 #LadySuperstarNayanthara #VijayTelevision pic.twitter.com/LC7srakF8z
— Vijay Television (@vijaytelevision) August 18, 2021