అతడు హీరో కమ్ విలన్. ఓవరాల్ ఇండియా వైడ్ ఫేమస్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ ఫిజిక్ మెంటైన్ చేసే ఈ నటుడు.. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి చెందిన ఓ ముద్దుగుమ్మతో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడామెకు బ్రేకప్ చెప్పేశాడు. ఇంతకీ ఏం జరిగింది?
పెళ్లి అనే బంధం చాలా పవిత్రమైంది. ఒక్కసారి తాళి కట్టి, కలిసి ఏడడుగులు వేస్తే.. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుండాలి అనేది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు దీన్ని చాలామంది ఫాలో అవుతున్నప్పటికీ.. కొందరు మాత్రం భోజనం చేసినంత ఈజీగా ప్రేమ- పెళ్లి-.బ్రేకప్ లు చెప్పేసుకుంటున్నారు. ఇలాంటివాళ్లు ఎవరూ ఏం చేసినా పెద్దగా పట్టించుకోరు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాస్త ఎక్కువైపోతున్నట్లు కనిపిస్తున్నాయి. మిగతావాళ్ల సంగతేమో గానీ స్టార్ హీరోలు ఇలా బ్రేకప్, డైవర్సో చెబితే ఫ్యాన్స్ అస్సలు తీసుకోలేకపోతున్నారు. తాజాగా ఓ స్టార్ హీరో కూడా తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశాడు. ప్రస్తుతం ఆ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన విద్యుత్ జమ్వాల్.. 2011లో వచ్చిన ఎన్టీఆర్ ‘శక్తి’ మూవీతో నటుడిగా మారాడు. అదే ఏడాది ‘ఊసరవెల్లి’లోనూ విలన్ గా కనిపించి టాలీవుడ్ కొంతమేర ఫ్యాన్స్ ని సంపాదించాడు. తమిళంలోనూ బిల్లా 2, తుపాకీ తదితర సినిమాలు చేసి అలరించాడు. ఆ తర్వాత బాలీవుడ్ కి షిప్ట్ అయిపోయాడు. తెలుగు, తమిళంలోనూ విలన్ గా చేసినవాడు కాస్త హిందీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘కమాండో’ సిరీస్ తో హిట్స్ మీద హిట్స్ కొట్టాడు. ‘ఖుదా హఫీజ్’ అనే మరో మూవీ సిరీస్ లోనూ విద్యుత్ హీరోగా చేశాడు. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.
విద్యుత్ పర్సనల్ లైఫ్ చూసుకుంటే.. ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో 3 ఏళ్ల క్రితమే ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అంటే 2021 సెప్టెంబరులో వీళ్లిద్దరికీ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. తమ ప్రేమని ఎక్స్ ప్రెస్ చేస్తూ ఇన్ స్టాలో పోస్టులు పెట్టిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే విడిపోయింది. రీసెంట్ గా ఓ పెళ్లికి హాజరైన విద్యుత్, నందిత ఎడమొహం పెడమొహంగా కనిపించారు. ఇది గమనించిన చాలామంది నెటిజన్స్.. ఈ జోడీ బ్రేకప్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నందితాకు ఇప్పటికే ఓసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. రణ్ బీర్, దినో మోరియా లాంటి బాలీవుడ్ హీరోలతో రిలేషన్ షిప్ మెంటైన్ చేసింది. ఇప్పుడు విద్యుత్ కూడా ఆమెకు బ్రేకప్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరి పెళ్లి కాకుండానే స్టార్ హీరో విడిపోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.