ఇటీవల వచ్చిన తమిళ చిత్రాల్లో ప్రేక్షకుల ఆదరణను ఎక్కువగా పొందిన సినిమాగా ‘విడుదల’ను చెప్పొచ్చు. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
తమిళ సినీ ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ‘విడుదలై: పార్ట్-1’. కమెడియన్ సూరి, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించారు. మార్చి 31వ తేదీన విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్‌తో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో ‘విడుదల’గా అనువాదమై మోస్తరు విజయాన్ని సాధించింది. కలెక్షన్ల సంగతి పక్కనబెడితే.. మేకింగ్, యాక్టింగ్, సినిమాటోగ్రఫీ పరంగా ఈ చిత్రం బెస్ట్ అంటూ చాలా మంది మెప్పును పొందింది. అలాంటి ‘విడుదల’ మూవీ ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ సినిమా తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ రిలీజ్ సందర్భంగా అభిమానులకు ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ ప్లాన్ చేసింది ‘విడుదల’ మూవీ టీమ్.
ఓటీటీలో డైరెక్టర్స్ కట్ ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, థియేటర్లో చూడని చాలా సీన్స్‌ను ఇందులో చూడొచ్చు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 సంస్థ ఒక ట్వీట్ చేసింది. ఏప్రిల్ 28 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. అయితే తెలుగు వెర్షన్ ఎప్పుడు తీసుకొస్తారో అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘విడుదల’ కథ విషయానికొస్తే.. కుమరేశన్ (సూరి) కొత్తగా జాబ్‌లో చేరిన ఒక పోలీస్ కానిస్టేబుల్.. ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు పనిచేస్తున్న స్పెషల్ పోలీస్ ఫోర్స్‌లో డ్రైవర్‌గా చేరతాడు. పాప (భవానీ శ్రీ)తో కుమరేశన్ ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారుతుంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు పెరుమాళ్ కోసం సాగించే వేటలో కుమరేశన్ ఎలాంటి సంఘర్షణకు గురయ్యాడనేదే మిగిలిన కథ. పెరుమాళ్‌గా విజయ్ సేతుపతి ఎప్పటిలాగే ఆకట్టుకోగా.. కుమరేశన్ పాత్రలో సూరి అదరగొట్టాడు.
A Gripping, Raw, Intense crime thriller🤯
Vetrimaaran’s cut of #ViduthalaiPart1, an Extended version premieres April 28 only on #ZEE5Tamil @ZEE5Tamil #VetriMaaran @ilaiyaraaja @VijaySethuOffl @sooriofficial @rsinfotainment @BhavaniSre @GrassRootFilmCo @VelrajR @dirrajivmenon… pic.twitter.com/buG5CQ0wnA— Actor Soori (@sooriofficial) April 27, 2023