ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ అంతా OTT వేదికలు రాగానే మెల్లగా వారిలో దాగి ఉన్న ప్రతిభలను బయట పెడుతున్నారు. ముఖ్యంగా టాక్ షోలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు మన తెలుగు స్టార్లు. తెలుగు ప్రేక్షకులకు అన్నివిధాలా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఓటిటి ఆహా. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నెలకొల్పిన ఈ ఓటిటి.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని సినిమాలు, షోలను ప్రవేశపెడుతోంది.
ఇప్పటికే సామ్ విత్ జామ్ టాక్ షో ఓ మాదిరిగా క్లిక్ అవ్వగా, రీసెంట్ గా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రారంభించిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో అద్భుతమైన స్పందన రాబట్టుకుంది. అలాగే ఇండియాలోని బెస్ట్ టాక్ షోలలో ఒకటిగా అన్ స్టాపబుల్ నిలవడం విశేషం. ఇప్పటికే బాలయ్య ఈ షో ద్వారా తనలోని హోస్టింగ్ టాలెంట్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు.తాజాగా మరో టాలీవుడ్ అగ్రహీరో ఆహా కోసం ఓ టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్. మరి ఎవరు ఆ స్టార్ అంటే.. విక్టరీ వెంకటేష్. అవును.. స్టేజిలపైనే మాట్లాడేందుకు వెనకాడే వెంకీ మామతో టాక్ షో అంటే సాహసమనే చెప్పాలి అంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే వెంకీ ఎప్పుడు కూడా స్టేజిలపై ధైర్యంగా మాట్లాడింది లేదు. ఒక్కోసారి తన సినిమాల ఫంక్షన్స్ లో కూడా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటాడు.
మరి ప్రస్తుతం వెంకీని టాక్ షో చేసేందుకు ఆహా టీంతో పాటు అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ వెంకీ మామ ఓకే చేస్తే మాత్రం తనలోని హోస్టింగ్ టాలెంట్ చూడవచ్చు. అదేవిధంగా మెగాస్టార్ చిరు, కింగ్ నాగ్, నటసింహం బాలయ్యల తర్వాత ఆ లిస్ట్ లో వెంకీ చేరే అవకాశం ఉంది. వెంకీ ప్రస్తుతం F3 సినిమాలో నటిస్తున్నాడు. మరి వెంకీ మామ ఓటిటి టాక్ షో హోస్ట్ గా రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.