చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవల ప్రముఖ స్టంట్ మాస్టర్ సురేష్ మృతిని మరువకముందే.. మరో ప్రముఖ నటుడు కన్నుమూసిన వార్త ఇండస్ట్రీని కలచివేస్తోంది. ఇంతలోనే ప్రముఖ మలయాళ నటుడు కొచ్చు ప్రేమన్ ఇక లేరనే వార్త ప్రేక్షకులలో విషాదం నింపింది. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా కొనసాగుతున్న కొచ్చు ప్రేమన్.. శనివారం తిరువనంతపురంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 68 సంవత్సరాలు. కాగా.. కొచ్చు ప్రేమన్ ఆకస్మిక మృతి ఫ్యాన్స్ అందరినీ బాధిస్తోంది. సినీవర్గాల సమాచారం ప్రకారం.. కొచ్చు ప్రేమన్ కొంతకాలంగా లంగ్స్ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నారు.
1955లో జన్మించిన ప్రేమన్.. తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, నటి గిరిజా ప్రేమన్, కుమారుడు హరికృష్ణన్ ఉన్నారు. ఇక పేయాడ్ లోని ప్రభుత్వ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను పూర్తిచేశారు. నాటకాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించి.. తక్కువ కాలంలోనే మలయాళ నాటకరంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలో అడుగుపెట్టి.. తిలక్కం, కళ్యాణరామన్ చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ప్రేమన్.. మొహమ్మద్ మణి రచించిన ఎజు నిరంగల్ (1979) సినిమాతో తన సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. అలా తిలక్కం, కళ్యాణరామన్, తెంకాసిపట్టణం, మరియు పట్టాభిషేకం వంటి సినిమాల్లో కామెడీ రోల్స్ చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన సినిమాలే కాకుండా సీరియల్ రంగంలో కూడా రాణించారు. కలివీడు, మిసెస్ హిట్లర్, స్వామి అయ్యప్పన్ వంటి పాపులర్ సీరియల్స్ లో నటించారు. ప్రేమన్ చివరిగా తెరపై కనిపించిన సినిమా.. ‘కడువా’. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా ఇది. అంతేగాక ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న ‘ఆరాట్టు’ మూవీలో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రేమన్ మరణం మలయాళ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇక ప్రేమన్ మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.
Kochu Preman Chettan, who was a constant presence in Malayalam cinema, passed away.
May his soul Rest In Peace, Condolences to the friends and family 💐 pic.twitter.com/ojUXrnAqD4
— ALIM SHAN (@AlimShan_) December 3, 2022
#KochuPreman About His Favorite Actor ❤️@Mohanlal pic.twitter.com/eewQCyXXv7
— Akshay 𓃵 (@Akshayk_2255) December 3, 2022