మారుతున్న కాలంతోపాటుగా ఇండియన్ సినిమా ఎంతో మారుతూ వచ్చింది. ఒకప్పుడు సినిమా అవకాశాలు, పాత్రలు, రెమ్యూనరేషన్, పర్సనల్ లైఫ్ ఇవి మాత్రమే చూసుకునే తారలు.. ఇప్పుడు నోరు విప్పడం ప్రారంభించారు. విషయం ఏదైనా సరే మీడియా ముందు కక్కేస్తున్నారు. ఇండస్ట్రీ విషయంలో కొన్నిసార్లు పోలిక, పొంతనలు ఉంటూ ఉంటాయి. ఆ రోజుల్లో హీరోలు క్రమశిక్షణ ఉండేవారు, ఈ రోజుల్లో సినిమాల్లో ఎక్స్ పోజింగ్ ఎక్కువైంది అనే వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి.
అయితే హీరోయిన్ల యాక్టింగ్, వారి వస్త్రధారణ విషయంలో మాత్రం ఇప్పటికీ ఆ పోలిక అనేది జరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వాళ్లు అప్పుడున్న వాళ్లు ఇలా చేశారు అంటారు. అప్పటి వాళ్లు ఇప్పుడున్న హీరోయిన్లు మరీ స్కిన్ షో చేస్తున్నారు అంటుంటారు. అలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు అలనాటి ప్రముఖ హీరోయిన్ మందాకిని చేసింది.
ఒకప్పుడు ఆమె చేసిన సీన్‌ను గుర్తుచేస్తూ మందాకిని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజ్ కపూర్ నటించిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ అనే సినిమాతో మందాకినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అరంగేట్ర మూవీలోనే ఆమె చేసిన పాత్ర, సీన్స్ సంచలనంగా మారాయి. ఆ సినిమాలో పసిబిడ్డకు పాలిచ్చే సీన్ ఉంటుంది. జాకెట్ విప్పి బిడ్డకు పాలిచ్చే ఆ సీన్ అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఆ సీన్ విషయంలో డైరెక్టర్, మందాకినీకి ఎన్నో ప్రశంసలు అందాయి.
“ఇప్పుడు హీరోయిన్లు చేస్తున్న దానితో పోలిస్తే అప్పట్లో మేం చేసింది అసలు స్కిన్ షోనే కాదు. రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో నేను మాతృత్వంతో బిడ్డకు పాలు పట్టిన సీన్ అది. డైరెక్టర్ ఒక టెక్నిక్ వాడి ఆ సీన్ షూట్ చేశారు. నిజానికి నేను ఆ సీన్లో స్కిన్ షో అసలు చేయలేదు. అదే ఆ సీన్‌ను ఇప్పుడు తీస్తే అంతా కామంతో చూస్తారేమో” అంటూ మందాకినీ ప్రశ్నించింది.
అయితే ఈ వ్యాఖ్యలతో మందాకినీ ఇప్పటి హీరోయిన్లు స్కిన్ షో చేస్తున్నారు బాగా అని చెప్పిందని అర్థమైంది. అంతేకాకుండా మరోవైపు అప్పటి సీన్ ఇప్పుడు తీస్తే అంతా కామంతో చూస్తారంటూ అటు ప్రేక్షకులకు కూడా చురకలు అంటించింది. ప్రస్తుతం మందాకినీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే మందాకినీ కామెంట్స్ పై బాలీవుడ్ హీరోయిన్లు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. మదాకినీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.