బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు విషాద వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళ పరిశ్రమకు చెందిన సెవ్వరాజ్ అనే నటుడు చనిపోయాడు. నిన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి, ప్రముఖ జ్యోతిష్యుడు పి. ఖురానా చనిపోయారు. తాజాగా సీనియర్ నటి కన్నుమూశారు.
ఇటీవల వరుసగా సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటీనటులు కన్నుమూస్తున్నారు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు విషాద వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న తమిళ పరిశ్రమకు చెందిన సెవ్వరాజ్ అనే నటుడు చనిపోయాడు. ఈయన తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలితకు సన్నిహితుడు కావడం గమనార్హం. అలాగే నిన్న బాలీవుడ్ ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి, ప్రముఖ జ్యోతిష్యుడు పి. ఖురానా (బాలీవుడ్ సినిమాలకు ముహుర్తాలు పెడుతుంటారు) దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. తాజాగా ఇప్పుడు మరో విషాదం నెలకొంది. సీనియర్ నటీమణి తుది శ్వాస విడిచారు.
సీనియర్ నటి వి.వసంత (82) ఇక లేరు. శుక్రవారం సాయంత్రం చెన్నైలోని స్వగృహంలో వయస్సు సంబంధిత అనారోగ్య సమస్యలతో ప్రాణాలు విడిచారు. చెన్నై వెస్ట్ కేకేనగర్‌లోని వి.డి.లోకనాథ్ వీధిలోని నివసిస్తున్న ఈమె రంగస్థల నటి. ఎం.కె.త్యాగరాజ భాగవతార్ నాటక ట్రూప్‌లో పలు నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత నటుడు జై శంకర్ ‘ఇరవుం పగలుమ్’, అశోకన్ సరసన ‘కార్తీక దీపం’సినిమాలో కనిపించింది. 1970-1980వ దశకంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను పోషించారు. మూండ్రామ్‌పిరై చిత్రంలో నటి శ్రీదేవికి తల్లిగాను, రాణువవీరన్ చిత్రంలో రజనీకాంత్‌కు అమ్మగా నటించి గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఆమె మృతికి పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతానం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.