ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత

బాగా పేరు పొందిన హీరోలు, సంగీత దర్శకులు, నటులు చనిపోతున్న వార్తలు సినీ రంగాన్ని దు:ఖ సాగరంలోకి ముంచెత్తుతున్నాయి. సంగీత దర్శకులు రాజ్, సీనియర్ నటుడు శరత్ బాబు ఒక్క రోజు గ్యాప్‌లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు మరో సీనియర్ నటి తుది శ్వాస విడిచారు.

సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాగా పేరు పొందిన హీరోలు, సంగీత దర్శకులు, నటులు చనిపోయారన్న వార్తలు సినీ రంగాన్ని దు:ఖ సాగరంలోకి ముంచెత్తుతున్నాయి. సంగీత దర్శకులు రాజ్, సీనియర్ నటుడు శరత్ బాబు ఒక్క రోజు గ్యాప్‌లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మలయాళ నటుడు హరీష్ పెంగన్ అనారోగ్యంతో , కన్నడ యువ నటుడు, దర్శకుడు నితిన్ గోపీ చిన్న వయస్సులోనే గుండె పోటుతో మరణించిన సంగతి విదితమే. ఇప్పుడు మరో సీనియర్ నటి తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ అనేక సినిమాల్లో తల్లి పాత్రలో మెప్పించిన సులోచన లట్కర్ ఆదివారం కన్నుమూశారు.

సులోచన లట్కర్ వయస్సు 94 ఏళ్లు. వయస్సు సంబంధిత సమస్యలతో ముంబయి దాదర్‌లోని సుశ్రుసా ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. 1928లో జులై 30న కర్ణాటకలోని ఖడక్లాత్‌లో జన్మించిన సులోచన 1946లో సినీ రంగ ప్రవేశం చేశారు. తొలుత మఠారీ సినిమాల ద్వారా సినీ ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మఠారీలో 50, హిందీలో 250 సినిమాలు చేశారు.అబ్ దిల్లీ దుర్ నహిన్, సుజాత, ఆయే దిన్ బహర్ కే, దిల్ దేకే దేఖో, ఆషా, మజ్బూర్, నై రోష్ని, ఆయీ మిలన్ కి బేలా, గోరా ఔర్ కాలా, దేవర్, బాందిని వంటి చిత్రాలలో ఆమె కనిపించారు. శ్రీ 420, నాగిన్, అబ్ దిల్లీ దుర్ నహిన్ మరియు మిస్టర్ అండ్ మిసెస్ వంటి చిత్రాల్లో మెప్పించారు.

బాలీవుడ్ లో చాలా మందికి తల్లిగా నటించిన ఆమె.. సునీల్ దత్, దేవానంద్, రాజేష్ ఖన్నాలకు తల్లి పాత్రలు చేయడం అంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సులోచనకు 1999లో పద్మశ్రీ అవార్డు, 2009లో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర భూషణ్ అవార్డు లభించింది. మార్చిలో కూడా ఆమె ఆరోగ్యం దిగజారడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భరిస్తానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హామీ ఇవ్వడంతో పాటు తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి ముఖ్యమంత్రి నిధి నుంచి రూ.3 లక్షలు కూడా ఇచ్చారు. అప్పట్లో డిశ్చార్జి అవ్వగా..తాజాగా మరో సారి ఆసుపత్రి పాలై తుది శ్వాస విడిచారు. ఆమెకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed