విలక్షణ నటి షావుకారు జానకి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘షావుకారు’ సినిమాతో పరిచమైన ఆమె.. ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చిన ఆమె అద్భుతమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె తెలుగుతో పాటు తమిళంలో సైతం హీరోయిన్‌గా రాణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తన దగ్గరకు వచ్చిన పాత్రలకు ఓకే చెప్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షావుకారు జానకి.. సుమన్‌టీవీకి ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇది కూడా చదవండి: Movie Reviewer Lakshman: రివ్యూ చెప్పేటప్పడు చేసేదంతా ఓవర్ యాక్షనేనా.. లక్ష్మణ్ రియాక్షన్ ఏంటంటే!
ఇక గతంలో షావుకారి జానకిని తెలుగు పరిశ్రమ పక్కకు పెట్టిందనే వార్తలపై ఆమె స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని.. తనకు తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయన్నారు. తాను ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌లతో కలిసి చేసిన ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు. అనంతరం భర్తతో విడాకులపై ఆమె స్పందించారు. తాను సంపాదించిదంతా తన భర్త నాశనం చేశాడని చెప్పారు. ‘నేను కష్టపడి సంపాదిస్తుంటే. మా ఆయన ఆ డబ్బును తాగుడు, వ్యసనాలకు వృధా చేసేవాడు. కొంతకాలానికి చూస్తే ఆస్తులన్ని కరిగిపోయాయి. పిల్లల పేరు మీద కొన్న ఆస్తులు కూడా పోయాయి. ఎంతో నమ్మ ద్రోహానికి గురయ్యాను. ఇప్పుడు అవన్ని ఉంటే కొన్ని వందల, వేల కోట్ల రూపాయలు విలువ చేసేవి. ఇక ఆయనతో ఉంటే పిల్లలను పెంచే పరిస్థితి కూడా ఉండదేమోనని నిర్ణయించుకున్న. అందుకే విడాకులు తీసుకున్నా’ అని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి: Sohail-Seema: విడిపోనున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. షాక్ లో ఫ్యాన్స్!
అంతేగాక ‘సినిమాలు చేస్తూ చాలా కష్టపడ్డాను. డబ్బు ఉంటే రియల్ ఎస్టేట్‌లో పెట్టేదాన్ని. ఎక్కడ పడితే అక్కడ స్థలాలు కొన్నాను. కానీ మా ఆయన తన తాగుడు కోసం ఆస్తులు అమ్ముతూ వచ్చాడు. ఇప్పుడు ఆ స్థలాలన్ని ఉంటే.. వందలు, వేల కోట్ల రూపాయలు విలువ చేసేవి. కానీ మా ఆయన కనీసం నా గురించి, పిల్లల గురించి కూడా ఆలోచించలేదు. ఆయన వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి వచ్చింది. అంత కష్టపడి డబ్బు సంపాదించినప్పటికి కూడా నేను ఒక్క పూట భోజనం చేసిన రోజులు ఉన్నాయి’ అంటూ షావుకారు జానకి చెప్పుకొచ్చారు. షావుకారి జానకి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.