ఈ మధ్య కాలంలో సినీ రంగానికి చెందిన పలువురు నటీనటులు, ప్రముఖులు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొనడమే కాక.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ రంగానికి తీరని లోటుగా మారుతుంది. కొన్ని రోజుల క్రితమే ప్రముఖ కన్నడ నిర్మాత, మరో ఇద్దరు యాక్టర్స్ మరణించగా.. తాజాగా శుక్రవారం మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ, తెలుగు, తమిళం, తమిళంతో పాటు, హిందీ వంటి పలు భాషల్లో నటించిన ప్రముఖ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి (67) రాయచూర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కెప్టెన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలిపారు. చలపతి చౌదరిది ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడ స్వస్థలం. తరువాత ఆయన కర్ణాటకలోని రాయచూర్‌లో స్థిరపడ్డారు.
కెప్టెన్ చలపతి చౌదరి కన్నడ, తెలుగు, హిందీతో సహా అనేక భాషా చిత్రాలలో నటించారు. బహుభాషా నటుడు అయిన చౌదరి ఇప్పటి వరకు 100 చిత్రాలకు పైగా నటించారు. అన్ని భాషల్లోని స్టార్ నటీనటులతో ఆయన స్క్రీన్ పంచుకున్నాడు. కన్నడ సినీ నటుడు శివరాజ్ కుమార్, తెలుగులో బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి సహా పలువురు స్టార్ హీరోలతో ఆయన నటించారు. ప్రస్తుతం సీరియల్‌లో నటిస్తున్నాడు. కెప్టెన్ చలపతి చౌదరి దక్షిణాది, హిందీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెండితెర మీదనే కాక.. బుల్లి తెర మీద కూడా మంచి పాత్రలు చేస్తూ గుర్తింపు పొందాడు. ఆయన మృతి సినిమాకే కాక బుల్లితెరకు కూడా తీరని లోటు.
ఇది కూడా చదవండి: Mahesh Babu: తనను బాగా ఏడిపించిన సినిమా ఏదో చెప్పేసిన మహేష్ బాబు!
కెప్టెన్ చలపతి చౌదరి మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. ఇక అభిమానుల సందర్శనార్థం.. ఆయన పార్థీవ దేహాన్ని రాయచూరులోని కేఎం కాలనీలో ఉంచారు. శుక్రవారం సాయంత్రం ముక్తిధమ్మంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు, బుల్లితెర కళాకారులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Nandyal: పోలీసుల ఓవరాక్షన్.. మైనర్ బాలికను మగాళ్ల మధ్యలో కూర్చోబెట్టి పిఎస్ కి తరలింపు!