సినీ ఇండస్ట్రీ అన్నాక ఫామ్ లో ఉన్న హీరోలపై రూమర్స్, కాంట్రవర్సీలు క్రియేట్ అవ్వడం చూస్తూనే ఉంటాం. ఎంతటి స్టార్డమ్ ఉన్నా.. ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కలిగినా కెరీర్ పరంగా హిట్స్, ప్లాప్స్ తప్పవు. అయితే.. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరో విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో మద్యానికి బానిసైన డాక్టర్ క్యారెక్టర్ లో విజయ్ జీవించేశాడు. అదే సినిమాతో నటుడిగా అవార్డులు అందుకొని.. వేరే భాషల్లో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు.
దీంతో ఇండస్ట్రీకి మరో మంచి నటుడు దొరికాడని అందరూ భావించారు. అందరు అనుకున్నట్లుగానే విజయ్ తర్వాత సినిమా ‘గీతగోవిందం’తో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ రెడ్డిలో అగ్రెస్సివ్ గా కనిపించి యూత్ కి, గీతగోవిందంలో సాఫ్ట్ రోల్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. అయితే.. రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత విజయ్ కెరీర్ లో వరుస ప్లాప్స్ వరుస కట్టాయి. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ లతో పాటు ఇప్పుడు లైగర్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. విజయ్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. “విజయ్ జాతకంలో అష్టమదశ శని నడుస్తోందని.. విజయ్ మరో ఉదయ్ కిరణ్” అంటూ షాకిచ్చాడు. అలాగే గతంలో అరవింద్ స్వామి, అబ్బాస్, కునాల్, ఉదయ్ కిరణ్ లు ఎలాగైతే వచ్చిన కొంతకాలానికే స్టార్డమ్ అందుకుని.. ఆ తర్వాత ఒక్కసారిగా వెనకబడిపోయారో విజయ్ కూడా ఆ జాబితాలోకే వస్తాడని సంచలన కామెంట్స్ చేశాడు వేణు స్వామి.
ఇక విజయ్ దేవరకొండ గురించి గతంలోనే తాను చెప్పానని.. అందుకే తన పేరులో నుండి దేవరకొండ తీసేసి విజయ్ సాయిగా మార్చుకున్నాడని వేణుస్వామి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దీంతో అందరిలోనూ వేణు స్వామి చెప్పింది నిజంగానే విజయ్ కెరీర్ లో జరుగుతుందా? అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఇక విజయ్ తదుపరి సినిమా జనగణమన కూడా పూరి జగన్నాథ్ తోనే చేయనున్నాడు. మరోవైపు శివ నిర్వాణతో ఖుషి సినిమా చేస్తున్నాడు. మరి విజయ్ దేవరకొండపై వేణు స్వామి చేసిన వ్యాఖ్యల పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.